NIGAMA MEDIA (P) LTD
6.6 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Monday, November 2, 2026

సింగరేణి డిస్మిస్ కార్మికులకు శుభవార్త

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు యాజమాన్యం అంగీకారం
2023, 2024, 2025లో డిస్మిస్ అయిన కార్మికులకు మళ్లీ ఉద్యోగావకాశం
దరఖాస్తుల స్వీకరణకు త్వరలో సర్క్యులర్ విడుదల
ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):

సింగరేణి సంస్థలో వివిధ కారణాలతో డిస్మిస్ అయిన కార్మికులకు తిరిగి ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా కీలక ముందడుగు పడింది. డిస్మిస్ అయిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలనే ఏఐటీయూసీ డిమాండ్‌కు సింగరేణి యాజమాన్యం అంగీకారం తెలిపింది. ఈ మేరకు గుర్తింపు కార్మిక సంఘం యాజమాన్యంతో కుదుర్చుకున్న ఒప్పందం వివరాలను ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య సోమవారం మందమర్రి యూనియన్ కార్యాలయంలో వివరించారు.

ముఖ్యంగా 2023, 2024, 2025 సంవత్సరాల్లో డిస్మిస్ అయిన కార్మికులను తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు దరఖాస్తు చేసుకునే విధివిధానాలకు సంబంధించి సర్క్యులర్ మంగళవారం విడుదల చేయనున్నట్లు సీతారామయ్య తెలిపారు. సంబంధిత కార్మికులు ఈ విషయాన్ని గమనించాలని, సర్క్యులర్ విడుదలైన అనంతరం అందులో పేర్కొన్న నిబంధనలు, విధివిధానాల ప్రకారం దరఖాస్తులు సమర్పించాలని అయన కోరారు.డిస్మిస్ కారణంగా ఉద్యోగాలకు దూరమైన కార్మికులకు తిరిగి ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా యాజమాన్యం అంగీకరించడం పట్ల కార్మికుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఈ సందర్బంగా డిస్మిస్ కార్మిక కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. 

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.