NIGAMA MEDIA (P) LTD
6.6 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Monday, November 2, 2026

ప్రకృతిమిత్రకు రూ.26 వేల విలువైన సౌండ్ సిస్టం విరాళం

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల):

ఉద్యోగ విరమణ సందర్భంగా ప్రకృతి పరిరక్షణ కార్యక్రమాలకు తనవంతు సహకారం అందిస్తూ మంచిర్యాల జిల్లాకు చెందిన అగ్నిమాపక శాఖ అధికారి, ప్రకృతి ప్రేమికుడు మామిడి భగవాన్ రెడ్డి ఆదర్శంగా నిలిచారు. తెలంగాణ ప్రకృతిమిత్ర కార్యక్రమాలకు ఆకర్షితులైన ఆయన, తన భార్య పద్మతో కలిసి రూ.26 వేల విలువైన అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన అహుజా సౌండ్ సిస్టంను విరాళంగా అందజేశారు. మంచిర్యాలలోని ఎం. కన్వెన్షన్‌లో భగవాన్ రెడ్డి ఉద్యోగ విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి హాజరైన అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారుల సమక్షంలో ఈ సౌండ్ సిస్టంను తెలంగాణ ప్రకృతిమిత్ర సంస్థ ఫౌండర్ ప్రెసిడెంట్, ప్రభుత్వ వాల్టా అథారిటీ, పర్యావరణవేత్త గుండేటి యోగేశ్వర్‌కు అందజేశారు.

ఈ సందర్భంగా మామిడి భగవాన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పర్యావరణ హిత కార్యక్రమాలను తెలంగాణ ప్రకృతిమిత్ర సంస్థ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పది జిల్లాల్లో ప్రజలు, యువత, విద్యార్థులకు చేరవేస్తూ పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడం అభినందనీయమని కొనియాడారు. అనంతరం గుండేటి యోగేశ్వర్ మాట్లాడుతూ ప్రకృతి పరిరక్షణకు సహకారం అందించిన భగవాన్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎల్‌నినో వంటి వాతావరణ మార్పులు, వాటి ప్రభావంతో సంభవించే ప్రకృతి వైపరీత్యాల ముప్పును తగ్గించేందుకు ప్రతి పౌరుడు ప్రకృతిమిత్రగా మారి పర్యావరణ పరిరక్షణలో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని వివిధ జిల్లాలకు చెందిన జిల్లా అగ్నిమాపక అధికారులు, రాష్ట్ర హైడ్రా అధికారి ఎస్. శ్రీధర్ రెడ్డి, జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి రవికృష్ణ, మంచిర్యాల జిల్లా స్టేషన్ ఫైర్ అధికారులు, ఎంప్లాయిమెంట్ అధికారి రామగోని సత్యనారాయణ, రాయెళ్ల రమేష్ బాబు, దేవనంది శ్రీనివాస్, సూరం మురళి, మనోహర్ రెడ్డి తదితర ప్రభుత్వ శాఖల అధికారులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొన్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.