NIGAMA MEDIA (P) LTD
6.6 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Monday, November 2, 2026

విద్యాశాఖ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

కలెక్టర్‌కు జనసేన నాయకులు ఆవుల సాగర్, పిట్టల సుధాకర్ వినతి
కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల):

జిల్లాలోని విద్యాశాఖ పరిధిలో విధులకు గైర్హాజరు, తప్పుడు బిల్లులు, ఇతర అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని జనసేన నాయకులు ఆవుల సాగర్, పిట్టల సుధాకర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జిల్లాలోని పలు ప్రాంతాల్లో MIS, CCO, IERP, మెసెంజర్ ఉద్యోగులు విధులకు సక్రమంగా హాజరుకాకుండానే వేతనాలు పొందుతున్నట్లు ఆరోపించారు. ముఖ్యంగా భవిత కేంద్రాల్లో దివ్యాంగ విద్యార్థులకు విద్యాబోధన చేయాల్సిన అవుట్‌సోర్సింగ్ (IERP) ఉపాధ్యాయులు విధులకు దూరంగా ఉంటూ ఇతర పనులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.

దీంతో దివ్యాంగ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందకపోవడంతో పాటు, ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులతో సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నవారితో పాటు, తప్పుడు బిల్లులు సమర్పించి అక్రమాలకు పాల్పడినట్లు తేలిన బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను విజ్ఞప్తి చేశారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.