NIGAMA MEDIA (P) LTD
6.6 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Monday, November 2, 2026

పెన్షనర్ల కోసం జీవన్ ప్రమాణ్ ప్రత్యేక క్యాంపు ప్రారంభం

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):

సింగరేణి మాజీ ఉద్యోగులు (పెన్షనర్లు) సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని సింగరేణి యాజమాన్యం, సీఎంపీఎఫ్ కార్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో జీవన్ ప్రమాణ్ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ (DLC) పునరుద్ధరణ, అవగాహన ప్రత్యేక క్యాంపును సోమవారం మందమర్రి సీఈఆర్ క్లబ్‌లో ఘనంగా ప్రారంభించారు. మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీజీఎం (పర్సనల్) సీహెచ్. అశోక్, సీఎంపీఎఫ్ కమిషనర్ గోవర్ధన్, ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ సలేంద్ర సత్యనారాయణ క్యాంపును ప్రారంభించారు.

ఈ సందర్భంగా సీఎంపీఎఫ్ కమిషనర్ గోవర్ధన్ మాట్లాడుతూ.. మాజీ ఉద్యోగులు తమ జీవన్ ప్రమాణ్ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లను ఆన్‌లైన్ ద్వారా సులభంగా పునరుద్ధరించుకునేందుకు ఈ ప్రత్యేక క్యాంపును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పెన్షనర్లు సైబర్ మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సీఎంపీఎఫ్ కార్యాలయం నుంచి ఎలాంటి ఓటీపీ (OTP) సందేశాలు లేదా వాయిస్ కాల్స్ రావని, ఎవరైనా అటువంటి కాల్స్ చేసి వివరాలు అడిగితే స్పందించవద్దని స్పష్టం చేశారు.

కాగా, క్యాంపు తొలిరోజు హాజరైన పెన్షనర్లకు గోదావరిఖని సీఎంపీఎఫ్ కార్యాలయ సిబ్బంది, మందమర్రి ఏటిబీ సెల్ సిబ్బంది ఆన్‌లైన్ ద్వారా 185 మంది డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లను విజయవంతంగా పునరుద్ధరించి అందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పీఓ (ఏటిబీ సెల్) సత్యనారాయణతో పాటు జీఎం కార్యాలయ ఏటిబీ సెల్ సిబ్బంది, సీఎంపీఎఫ్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.