24.5 C
Munich
Tuesday, August 4, 2026

మణుగూరు ఓసి సింగరేణికి ఇవ్వకుంటే సమ్మె తప్పదు

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

జెన్కోకు ఇవ్వడానికి యాజమాన్యం కుట్ర
మందమర్రిలో ఏఐటీయూసీ ఆత్మీయ సమ్మేళనం
ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):

సింగరేణి డైరెక్టర్‌తో జరగనున్న సమావేశాల్లో మణుగూరు ఓసీ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించే విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోని నేపథ్యంలో ఇదే నెలలో కార్మిక గుర్తింపు సంఘం ఆధ్వర్యంలో సంస్థ అభివృద్ధి, కార్మికుల సంక్షేమ కోసంసమ్మెకు వెళుతామని ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య పిలుపునిచ్చారు. సింగరేణి శ్రేయస్సు కోసం ఉద్యోగులు, కార్మికులు సమ్మెకు సిద్ధంగా ఉండాలని కోరారు.

సోమవారం మందమర్రిలో నిర్వహించిన ఏఐటీయూసీ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం సింగరేణి సంస్థ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోందని, మణుగూరు ఓసీ బ్లాక్‌ను జెన్‌కోకు కాకుండా సింగరేణికే కేటాయించాలని ప్రభుత్వాన్ని ఇటీవల డిమాండ్ చేసినట్లు తెలిపారు. డైరెక్టర్‌తో జరగనున్న సమావేశంలో సానుకూల స్పందన రాని నేపథ్యంలో ఇదే నెలలో సమ్మె తప్పదని, అందుకు ఉద్యోగులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలపై స్పందిస్తూ, ఎన్నో రోజులుగా పెండింగ్‌లో ఉన్న జూనియర్ అసిస్టెంట్ పరీక్షలను త్వరలో నిర్వహించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. జీఎం కార్యాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ఏఐటీయూసీ అండగా ఉంటుందని తెలిపారు. కంపెనీ అవసరాల దృష్ట్యా జరిగిన క్లరికల్ బదిలీల విషయంలో, కొత్త నియామకాలు పూర్తైన అనంతరం సంబంధిత ఉద్యోగులను తిరిగి వారి యథాస్థానాలకు తీసుకురావడానికి కృషి చేస్తామని చెప్పారు.

ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు ఏఐటీయూసీలో చేరారు. జీఎం స్ట్రక్చర్ కమిటీ సభ్యులు రమణ, ఫిట్ సెక్రటరీ సృజన గీతిక సారథ్యంలో పర్చేజ్ విభాగానికి చెందిన సీనియర్ అసిస్టెంట్ జంగిలి అనూష, జనరల్ అసిస్టెంట్లు సిధామళ్ల రఘు, కుదిరే సువర్ణ, చిలుక దేవమ్మ, బరిగెల లక్ష్మి, ఏనుగు వినోద, భాగ్యలక్ష్మి తదితరులు ఏఐటీయూసీ సభ్యత్వం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ సెక్రటరీ అక్బర్ అలీ, ఏరియా వైస్ ప్రెసిడెంట్ భీమనాథుని సుదర్శన్, పిట్ కమిటీ సభ్యులు బొమ్మ శ్రీనివాస్, లక్ష్మణ్, బింగి సత్యనారాయణ, తోకల జ్యోతి, జలధి సుమలత, లక్కాకుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.