మణుగూరు ఓసి సింగరేణికి ఇవ్వకుంటే సమ్మె తప్పదు
జెన్కోకు ఇవ్వడానికి యాజమాన్యం కుట్ర మందమర్రిలో ఏఐటీయూసీ ఆత్మీయ సమ్మేళనం ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): సింగరేణి డైరెక్టర్‌తో జరగనున్న సమావేశాల్లో మణుగూరు ఓసీ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించే విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోని నేపథ్యంలో ఇదే నెలలో కార్మిక గుర్తింపు సంఘం ఆధ్వర్యంలో సంస్థ అభివృద్ధి, కార్మికుల సంక్షేమ కోసంసమ్మెకు వెళుతామని ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య పిలుపునిచ్చారు. సింగరేణి శ్రేయస్సు కోసం ఉద్యోగులు, కార్మికులు సమ్మెకు సిద్ధంగా ఉండాలని కోరారు. సోమవారం మందమర్రిలో నిర్వహించిన ఏఐటీయూసీ ఆత్మీయ...