Heroine : చిత్ర పరిశ్రమలో ప్రేమ పెళ్లిళ్లు ఎక్కువగా జరుగుతాయి. పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు చాలా తక్కువే ఉంటాయి. కానీ కొందరు బాగా సంపాదించిన తరువాతనే పెళ్లి చేసుకోవాలనుకుంటారు హీరోయిన్ లు. పెళ్లి తరువాత నటనకు ముందుకు రారు. మరి కొందరు పెళ్లి తరువాత కూడా సినిమాల్లో నటించిన వాళ్ళు ఉన్నారు. అయితే ఓ అందాల ముద్దు గుమ్మ ఓ ఎవర్ గ్రీన్ అబ్బాయిని ప్రేమించింది. ఈ విషయాన్ని తానే స్వయంగా తన తల్లి, దండ్రులకు చెప్పేసింది. ఆ అబ్బాయితోనే పెళ్లి జరిపించాలని కోరింది. ఇప్పుడు ఆ ముద్దు గుమ్మ పెద్దలు అబ్బాయి తల్లి,దండ్రులతో ఒప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతకు ఎవరు ఆ ముద్దు గుమ్మ అనే విషయాలను ఇప్పడు తెలుసుకుందాం.
తెలుగు చిత్ర పరిశ్రమలో దూసుకుపోతున్న అందాల ముద్దు గుమ్మల్లో నిధి అగర్వాల్ ఒకరు. యంగ్ హీరో నాగ చైతన్య హీరోగా నటించిన సవ్యసాచి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు ఈ భామ పరిచయం అయ్యింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఆ సినిమా అభిమానులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బంగారు బొమ్మ అయిపొయింది.
తమిళ హీరో శింబుతో ప్రేమలో పడిందని తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో గుసగుసలు మొదలయినాయి. అదంతా తప్పు అంటూ నిధి అగర్వాల్ కొట్టిపారేసింది. తాజాగా మరోసారి నిధి, శింబు ప్రేమలో పడ్డారనే వార్తలు గుప్పుమన్నాయి. ప్రస్తుతానికి రెండు కుటుంబాల సభ్యులు పెళ్లి చేయడానికి చర్చలు జరుపుతున్నారని చిత్ర పరిశ్రమ వర్గాల సమాచారం.