Actor Nagarjuna : ప్రముఖ తెలుగు సినీ నటుడు అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్ వివాదాస్పదంగా మారింది. గత ప్రభుత్వం నిర్మాణం అక్రమం అంటూ కూల్చడానికి చర్యలు చేపట్టింది. నాగార్జున కోర్ట్ కు వెళ్లడంతో ప్రభుత్వం నిలిపివేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే హైదరాబాద్ లో ఆక్రమణలకు గురైన చెరువులను కాపాడుకోడానికి హైడ్రా ను తీసుకువచ్చింది. తమ్మిడి కుంట చెరువులో నాగార్జున అక్రమంగా ఎం కన్వెన్షన్ నిర్మించాడని హైడ్రా పరిశీలనలో తేలిపోయింది. శనివారం హైడ్రా అధికారులు కూలగొట్టడం మొదలుపెట్టడంతో నాగార్జున కోర్ట్ కు వెళ్లారు. కోర్ట్ స్టే ఇచ్చింది.
ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై వివరణ ఈ విదంగా ఉంది. తమ్మిడికుంట చెరువులోని అనధికారిక నిర్మాణాల్లో ఎన్ కన్వెన్షన్ ఒకటిగా గుర్తించామన్నారు కమిషనర్ రంగనాథ్. చెరువులోని ఎఫ్ టీఎల్ లో ఎకరా 12 గుంటలు, బఫర్ జోన్ లోని 2 ఎకరాల 18 గుంటలను ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ నిర్మించారని తెలిపారు. ఎన్ కన్వెన్షన్ కు జీహెచ్ ఎంసీ నుంచి ఎలాంటి భవన నిర్మాన అనుమతులు ఇవ్వలేదు. అయినప్పటికీ బిల్డింగ్ రెగ్యులరేషన్ స్కీమ్ కింద అనుమతుల కోసం ఎన్ కన్వెన్షన్ ప్రయత్నాలు చేసింది. ఈ నేపథ్యంలో సంబంధితశాఖల అధికారులు కూడా అందుకు అనుమతి ఇవ్వలేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరించారు.