petra amavasya : పితృ పక్షాలు బుధవారం తో ముగియనున్నాయి. రేపు ఒక్కరోజు మాత్రమే పెద్దల పండుగను జరుపుకోడానికి అవకాశం ఉంది. చనిపోయిన వారికి ఇష్టమైన పదార్థాలను నైవేద్యంగా కుటుంబ సభ్యులు పెడుతారు. దీన్నే పెద్దల పండుగ అనికూడా అంటారు. ఈ పండుగను ఎక్కువ మంది అమావాస్య రోజు జరుపుకుంటారు. ఈ అమావాస్య చివరి రోజు కావడంతో కుటుంబం అంతా కలిసి జరుపు కుంటారు. ఇదే రోజు నుంచి విద్యార్థులకు సెలవులు. పిల్లలతో కలిసి జరుపుకుందామని అనుకున్న వారికి పెద్ద చిక్కు వచ్చింది.
పితృ పక్షము అమావాస్య సరిగ్గా అక్టోబర్ రెండో తేదీ కావడం పెద్ద సమస్య ఏర్పడింది. అక్టోబర్ రెండో తేదీ విశిష్టత గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. గాంధీ జయంతి. జయంతి రోజు మద్యం దుకాణాలతో పాటు, మటన్, చికెన్ దుకాణాలు కూడా మూసి ఉంటాయి. చికెన్ అంటే ఎదో చాటు మార్గంగా ఇంటిలో సర్దుకోవచ్చు. కానీ బ్రాందీ దుకాణాలు బంద్ తప్పనిసరి.
అందుకనే పెద్దల పండుగ జరుపుకునే వారంతా కూడా ఒకరోజు ముందుగానే అంటే మంగళ వారమే మద్యం కొనుగోలు చేస్తున్నారు. దింతో మద్యం దుకాణాలు రద్దీగా ఉన్నాయి. గిరాకి కూడా అప్పుడే దసరా గిరాకీని మరిపిస్తోంది. దింతో అధికంగా గిరాకీ కావడంతో మద్యం వ్యాపారస్తులు సంబరపడిపోతున్నారు.