MLC Kavitha : బిఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత మంగళవారం ఆసుపత్రిలో చేరారు. జైలు లో ఉన్నప్పుడు ఆమె గురయ్యారు. అప్పుడు ఒకసారి ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. బెయిల్ పై ఇంటికి వచ్చిన ఆమె ప్రస్తుతం గులాబీ అధినేత కేసీఆర్ ఇంటిలోనే ఉంటున్నారు. మానసికంగా ఆమె కోలుకోడానికే కేసీఆర్ వద్ద ఉంటున్నట్టు సమాచారం.
హైదరాబాద్ లోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో కవిత చేరినట్టు పార్టీ నాయకులు తెలిపారు. జైలు లో ఉన్న సమయంలో ఆమె కొంత అనారోగ్యానికి గురయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆమె వైద్య పరిక్షల కోసం ఆసుపత్రిలో చేరినట్టుగా పార్టీ వర్గాలు తెలిపాయి