T -20-CUP : ఓటమి కళ్లెదుట కనబడుతోంది…. జట్టుకు కష్టాలు తప్పడంలేదు…. మ్యాచ్ చేజారిపోతోంది …. ప్రత్యర్థులను కట్టడి చేయలేకపోతున్నాం… ఎంత కష్టపడినా ఓటమి తప్పడంలేదు…. సాధ్యం కానిదాన్ని సాధించే ఆటగాడు ఇప్పుడు అవసరం… ఆదుకునే ఆటగాడు ఎవరయితే బాగుంటది…. ఈ సమయంలో బంతిని ఎవరికీ అందివ్వాలి. ఎవరైతే బంతితో ప్రత్యర్థులను కట్టడి చేస్తారు… వీటన్నింటికి ఒక్కడే సమాధానం చెబుతాడు. ఇండియా జట్టును కష్టకాలంలో ఆదుకునే ఆపద్బాంధవుడు ఒకే ఒక్కడు ఎవరంటే… అతడే జస్ ప్రీత్ బుమ్రా….
ప్రపంచ క్రికెట్ జట్లలో ఉన్న పేస్ బౌలర్లలో బుమ్రా ఒకరు కావడం విశేషం. బుమ్రా ఆట తనకంటే వెయ్యి రెట్లు ఎక్కువ అని క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ అన్నాడంటే బుమ్రా అట గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రధాన ఆటగాళ్లు అందరు కూడా బుమ్రా ఆట బలా అని పొగుడుతున్నారంటే అతని బౌలింగ్ గురించి చెప్పాల్సిన పరిస్థితి లేదు. తాజాగా ఇండియా జట్టు ఫైనల్ పోటీలో బుమ్రా ఆడిన ఆట ఎంతో అద్భుతంగా ఉంది.
బుమ్రా ఆట కేవలం ప్రత్యర్ధుల వికెట్లు తీయడమే కాదు, వాళ్ళ పరుగులకు కళ్లెం ఎలా వేయాలో కూడా తెలుసు. బుమ్రా తన బంతితో స్టంప్స్ లేపేస్తుంటే చూడడానికి రెండు కళ్ళు కూడా సరిపోవు. బ్యాటర్ల బలహీనతలను ముందే పసిగట్టి అందుకు తగిన విదంగా బంతి వేసి కట్టడి చేయడంలో సిద్ధహస్తుడు అనే పేరు జట్టులో ఉంది. 2024 టోర్నీలో ఎనిమిది మ్యాచ్ లు ఆడి పదిహేను వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.
దక్షిణాఫ్రికాతో ఉత్కంట భరితంగా సాగుతున్న ఆటలో బుమ్రా రంగంలోకి దిగాడు. 18 వ ఓవర్లో కెప్టెన్ బుమ్రా చేతికి బంతి ఇచ్చాడు. కేవలం రెండు పరుగులే ఇచ్చాడు. ఒక వికెట్ తీసుకున్నాడు. ఇక విజయం భారత జట్టు వశమైనది.