NIGAMA MEDIA (P) LTD
11.5 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Wednesday, November 18, 2026

సివిల్ డిపార్ట్మెంట్ సమస్యలు పరిష్కరించాలి

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

సీఐటీయూ ఆధ్వర్యంలో డీజీఎంకు వినతిపత్రం
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):

సివిల్ డిపార్ట్మెంట్‌లో కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సీఐటీయూ సివిల్ డిపార్ట్మెంట్ పిట్ సెక్రటరీ రాజకుమార్ ఆధ్వర్యంలో మంగళవారం వినతిపత్రం అందజేశారు. సూపర్వైజర్ రాకేష్ ద్వారా డీజీఎంకు వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు మాట్లాడుడూ ఫిల్టర్ బెడ్లలో ఇటీవల దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో అన్ని ఫిల్టర్ బెడ్ల వద్ద గతంలో మాదిరిగా రాత్రివేళల్లో సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే సెప్టెంబర్‌లో ఇవ్వాల్సిన పంపు ఆపరేటర్, వాల్వ్ ఆపరేటర్ తదితర యాక్టింగ్ ప్రమోషన్లను వెంటనే కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

ఫిట్టర్లకు కొత్త స్పానర్లు, వాల్వ్ ఆపరేటర్లు పంపులను ఆన్ చేసేందుకు అవసరమైన రెంచ్ పానాలు వంటి పనిముట్లు అందించాలని కోరారు. అదేవిధంగా పంపు డ్రైవర్లు, వాల్వ్ ఆపరేటర్లకు టార్చ్‌లైట్లు, చలికాలంలో అందించాల్సిన గరం కోట్లు ఇవ్వాలని, ప్లే డే రోజుల్లో సూపర్వైజర్‌ను నియమించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.

అనంతరం యూనియన్ నాయకులు మాట్లాడుతూ.. గతంలో కార్మికుల సంక్షేమం కోసం ఫిల్టర్ బెడ్లలో అధికారులు నిర్మించిన గద్దెలను కూర్చోవడానికి కూడా వీలు లేకుండా కూల్చివేయడం సరికాదన్నారు. ఫిల్టర్ బెడ్లలో దొంగతనాలు జరగకుండా కార్మికులకు, సిబ్బందికి సరైన అవగాహన కల్పించాలని కోరారు. కార్మికులు సంస్థ అభివృద్ధి కోసం మనస్ఫూర్తిగా పనిచేసేలా యాజమాన్యం ప్రోత్సహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ఉప ప్రధాన కార్యదర్శి అల్లి రాజేందర్, బ్రాంచ్ అధ్యక్షులు ఎస్. వెంకటస్వామి, పిట్ గౌరవాధ్యక్షులు సత్తయ్య, ఫిట్టర్ శ్రీనివాస్, ఆవాల రాజశేఖర్, కరుణాకర్తో పాటు సివిల్ డిపార్ట్మెంట్ కార్మికులు పాల్గొన్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.