NIGAMA MEDIA (P) LTD
11.5 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Wednesday, November 18, 2026

జిల్లా స్థాయి నెట్‌బాల్ పోటీల్లో మంచిర్యాల, ఆసిఫాబాద్ జట్ల విజయం

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) ఆధ్వర్యంలో మందమర్రి పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ వేదికగా నిర్వహించిన జిల్లా స్థాయి అండర్‌–17 బాలుర, బాలికల నెట్‌బాల్ పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో ముగిశాయి. వివిధ మండలాలు, ప్రాంతాల నుంచి తరలివచ్చిన క్రీడాకారులు పోటాపోటీగా తలపడి అద్భుతమైన క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఉదయం జరిగిన ప్రారంభ కార్యక్రమంలో మందమర్రి మండల విద్యాధికారి రాథోడ్ రమేష్ నెట్‌బాల్ పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ప్రారంభమైన మ్యాచ్‌లలో క్రీడాకారులు వేగవంతమైన పాసింగ్, సమన్వయం, రక్షణాత్మక ఆటతీరు, గోల్‌ సాధనతో ఆకట్టుకున్నారు. ప్రతి మ్యాచ్‌లో విజయం కోసం జట్లు తీవ్రంగా పోరాడడంతో పోటీలు ఉత్కంఠభరితంగా సాగాయి.

మంచిర్యాల బాలుర జట్టు విజేత

బాలుర అండర్‌–17 విభాగంలో మంచిర్యాల జిల్లా జట్టు ఛాంపియన్‌గా నిలిచింది. ఆసిఫాబాద్ జట్టు రన్నరప్‌గా నిలిచి ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకుంది. బాలికల విభాగంలో ఆసిఫాబాద్ జిల్లా జట్టు విజేతగా నిలవగా, ఆదిలాబాద్ జట్టు రన్నరప్‌గా నిలిచింది.

విజేతలకు ట్రోఫీలు, ప్రశంసాపత్రాలు

పోటీల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మందమర్రి సీఐ పర్స రమేష్, ఎస్ఐ జి. నరేష్, సింగరేణి డిప్యూటీ జనరల్ మేనేజర్ (పర్సనల్) అశోక్, ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ చైర్మన్ సతీష్ రెడ్డి, ఎస్జీఎఫ్ కార్యదర్శి యాకుబ్, కృష్ణవేణి టాలెంట్ స్కూల్ కరస్పాండెంట్ రాం వేణు హాజరయ్యారు. ఈ సందర్భంగా అతిథులు విజేత, రన్నరప్ జట్లకు ట్రోఫీలు, ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వారి ప్రతిభను ప్రశంసించారు.

ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ.. విద్యార్థులు విద్యాభ్యాసంతోపాటు క్రీడలపైనా సమానంగా దృష్టి సారించాలని సూచించారు. క్రీడలు శారీరక దారుఢ్యాన్ని పెంపొందించడంతోపాటు మానసిక ఉల్లాసం, క్రమశిక్షణ, జట్టు స్ఫూర్తి, నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేస్తాయని పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు ఇదే స్ఫూర్తితో రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.