NIGAMA MEDIA (P) LTD
11.5 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Wednesday, November 18, 2026

వార్డు స్థానం నుంచే పార్టీ బలోపేతం కావాలి

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

కామారెడ్డిలో బీజేపీ మైనార్టీ మోర్చా జిల్లా కార్యవర్గ సమావేశం
పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణం, భవిష్యత్ కార్యక్రమాలపై చర్చ
బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రజనీష్ జైన్
కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:

రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు జిల్లాల్లో నిర్వహిస్తున్న పర్యటనలో భాగంగా కామారెడ్డి జిల్లాలో బీజేపీ మైనార్టీ మోర్చా జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. కామారెడ్డి బీజేపీ జిల్లా కార్యాలయంలో మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు వాసిం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి బీజేపీ మైనార్టీ మోర్చా తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రజనీష్ జైన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జగ్ మోహన్ సింగ్ తో కలిసి రజనీష్ జైన్ మాట్లాడుతూ వార్డు స్థానం నుంచి పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామ, పట్టణ స్థాయిల్లోని వార్డుల్లో పార్టీ పటిష్టంగా ఉంటేనే ఏ ఎన్నికయినా పార్టీ అభ్యర్థులు గెలవడం సుళువవుతుందన్నారు. అనంతరం జిల్లా నాయకులతో సమావేశమై పార్టీ సంస్థాగత నిర్మాణం, మైనార్టీ మోర్చా బలోపేతం, క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించడం తదితర అంశాలపై అధ్యక్ష, ప్రధాన కార్యదర్సులు చర్చించారు.

అలాగే రానున్న రోజుల్లో కామారెడ్డి జిల్లాలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, మైనార్టీ వర్గాలకు పార్టీని మరింత చేరువ చేయడం, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పార్టీని బలోపేతం చేయడం వంటి అంశాలపై నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశానికి బీజేపీ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు చిన్న రాజులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మైనార్టీ మోర్చా జిల్లా నాయకులు, జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేశారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.