NIGAMA MEDIA (P) LTD
11.5 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Wednesday, November 18, 2026

సింగరేణి జీఎం (క్వాలిటీ) రవికుమార్‌కు ఘన వీడ్కోలు

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

పదవీ విరమణ సందర్భంగా మందమర్రి ఏరియాలో సన్మానం
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి

సింగరేణి కార్పొరేట్ జనరల్ మేనేజర్ (క్వాలిటీ) రవికుమార్ ఈ నెలలో పదవీ విరమణ పొందనున్న నేపథ్యంలో మంగళవారం మందమర్రి ఏరియాను సందర్శించారు. ఈ సందర్భంగా మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో యాజమాన్యం, అధికారులు ఘనంగా వీడ్కోలు సభ నిర్వహించారు. మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ఉన్నతాధికారులు పాల్గొని  రవికుమార్ సింగరేణి సంస్థకు అందించిన సుదీర్ఘ, విశిష్ట సేవలను కొనియాడారు. అనంతరం ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించి, జ్ఞాపికను అందజేశారు.

ఈ సందర్భంగా ఏరియా జీఎం ఎన్. రాధాకృష్ణ మాట్లాడుతూ.. సింగరేణి సంస్థ అభివృద్ధిలో  రవికుమార్ కీలక పాత్ర పోషించారని అన్నారు. ముఖ్యంగా రక్షణతో కూడిన ఉత్పత్తితో పాటు బొగ్గు నాణ్యత ప్రమాణాలను పెంపొందించడంలో ఆయన చూపిన శ్రద్ధ, నిబద్ధత ఎంతో ప్రశంసనీయమని పేర్కొన్నారు. సుదీర్ఘకాలం పాటు ఎలాంటి మచ్చ లేకుండా పూర్తి అంకితభావంతో విధులు నిర్వర్తించి సంస్థ ప్రగతికి విశేషంగా కృషి చేశారని అభినందించారు.

ఈ వీడ్కోలు కార్యక్రమంలో ఎస్.ఓ. టు జీఎం జి.ఎల్. ప్రసాద్, ఏజీఎం (ఎఫ్‌&ఏ) ఆర్.వి.ఎస్.ఆర్.కె. ప్రసాద్, కేకే ఏజెంట్ ఖాదిర్, శాంతిఖని ఏజెంట్ సంతోష్ కుమార్, డీజీఎం (ఐఈడీ) కిరణ్ కుమార్, ఏరియా సేఫ్టీ ఆఫీసర్  మురళి, డీజీఎం (సివిల్)  మదీనా భాష, డీజీఎం (సర్వే) భూక్య దేశాయ్, క్వాలిటీ అధికారి  ప్రదీప్, ఏరియా సెక్యూరిటీ అధికారి వెంకటేశ్వర్ రెడ్డితో పాటు మందమర్రి ఏరియాలోని వివిధ గనులు, విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది  రవికుమార్‌కు పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన భవిష్యత్ జీవితం సుఖసంతోషాలతో కొనసాగాలని ఆకాంక్షించారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.