NIGAMA MEDIA (P) LTD
7.5 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Tuesday, November 17, 2026

శ్రావణపల్లి, ఎల్లందు ఓసీ-3 గనులు సింగరేణికే దక్కాలి

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మందమర్రిలో రాస్తారోకో
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):

శ్రావణపల్లి ఓపెన్‌కాస్ట్ (ఓసీ), ఎల్లందు ఓసీ-3 గనులు సింగరేణి సంస్థకే దక్కేలా యాజమాన్యం టెండర్లలో పాల్గొని, గనులను సింగరేణికే కేటాయించే విధంగా ప్రభుత్వం సహకరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం మందమర్రిలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. మందమర్రి ఏరియా మార్కెట్ ప్రాంతంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ, బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ భీమనాధుని సుదర్శన్ ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలకుల అసమర్థత కారణంగా బిడ్డింగ్‌లో సింగరేణి పాల్గొనకుండా చేసి, ఎంఎండీఆర్ చట్టం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి వత్తాసు పలికి బొగ్గు గనులను సింగరేణికి దక్కకుండా చేశారని ఆరోపించారు. అనంతరం బొగ్గు గనులను తమ అనుయాయులకు కట్టబెట్టి సింగరేణిని నిర్వీర్యం చేశారని, రాజకీయ జోక్యంతో సంస్థను ఆర్థికంగా దెబ్బతీశారని విమర్శించారు. ప్రస్తుతం ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటున్న ప్రభుత్వం సింగరేణిపై తన చిత్తశుద్ధిని చాటుకోవాలని, శ్రావణపల్లి ఓసీ, ఎల్లందు ఓసీ-3 టెండర్లు ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణికే దక్కే విధంగా సహకరించాలని డిమాండ్ చేశారు.

అలాగే సమ్మె నోటీసులో అంగీకరించిన 24 డిమాండ్లను సర్క్యులర్ రూపంలో పరిష్కరించాలని కోరారు. ఈ నెల 18, 19 తేదీల్లో సింగరేణి వ్యాప్తంగా అన్ని జనరల్ మేనేజర్ కార్యాలయాల ఎదుట నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు తెలిపారు. అప్పటికైనా ప్రభుత్వం, యాజమాన్యం స్పందించి సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో సింగరేణిలో మెరుపు సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏరియా నాయకులు ఎక్కేటి రాజేశ్వరరావు, ములకలపల్లి వెంకటేశ్వర్లు, టేకుమట్ల తిరుపతి, పెద్దపల్లి బానయ్య, రాజేష్ కుమార్ యాదవ్, జి. సుదర్శన్ రెడ్డి, పిట్ కార్యదర్శులు గాండ్ల సంపత్, మర్రి కుమారస్వామి, సిహెచ్‌పీ శర్మ, కలువల శ్రీనివాస్, పారిపెల్లి సంజీవ్ కుమార్, శెట్టి రాజేందర్, ఊరకొండ శ్రీకాంత్, వెంకటేశ్వర్లు, రామ్ రెడ్డి, ప్రేమ్‌లాల్, సేఫ్టీ కమిటీ, మైన్ కమిటీ సభ్యులు, ఏఐటీయూసీ కార్యకర్తలు పాల్గొన్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.