కోల్ బెల్ట్ న్యూస్(పెద్దపల్లి):
కాల్వశ్రీరాంపూర్ మండలంలోని గంగారం గ్రామానికి చెందిన దామ స్వామి ఇటీవల స్వర్గస్థులైన నేపథ్యంలో తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్ మంగళవారం వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
దామ స్వామి కుమారుడు రాజేశం, ఇతర కుటుంబ సభ్యులను కలిసి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ఉండాలని, దామ స్వామి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో టీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు బొంగోని శంకరయ్య గౌడ్, కారుపాకల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

