NIGAMA MEDIA (P) LTD
16.1 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Saturday, October 3, 2026

సింగరేణి పెరిక ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆవిర్భావం

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

ఉద్యోగ, కార్మిక సమస్యల పరిష్కారానికి కృషి..
12 ఏరియాల్లో కమిటీల ఏర్పాటు

కోల్ బెల్ట్ న్యూస్(శ్రీరాంపూర్):

సింగరేణి పెరిక కుల ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆవిర్భావ సమావేశాన్ని శుక్రవారం శ్రీరాంపూర్‌లోని పీవీఆర్ గార్డెన్‌లో సింగరేణి కన్వీనర్ పేరం రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి సుమారు 400 మంది సింగరేణి ఉద్యోగులు హాజరై సంఘంలో సభ్యత్వం స్వీకరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పెరిక సంఘం అధ్యక్షులు గటిక విజయ్‌కుమార్ హాజరై మాట్లాడారు. సింగరేణి సంస్థలో పెరిక కులానికి చెందిన ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పనిచేస్తున్నారని, కష్టాన్ని నమ్ముకుని విధులు నిర్వహించే పెరిక ఉద్యోగులకు సంస్థలో ప్రత్యేక గుర్తింపు ఉందని తెలిపారు. సింగరేణి పెరిక కుల ఉద్యోగుల సంక్షేమ సంఘం ద్వారా ఉద్యోగుల ఐఆర్ సమస్యలు, కార్మిక సమస్యలు, సంక్షేమ అంశాల పరిష్కారానికి కృషి చేయడంతో పాటు ఉద్యోగుల మధ్య పరస్పర సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవచ్చని పేర్కొన్నారు.

విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యత…….

హైదరాబాద్‌లో గత 50 సంవత్సరాలుగా పెరిక హాస్టల్ ద్వారా ఎంతోమంది విద్యార్థులకు వసతి సౌకర్యం కల్పిస్తున్నామని గటిక విజయ్‌కుమార్ తెలిపారు. పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు విద్యాపరంగా చేయూత అందిస్తున్నామని చెప్పారు. ఎల్‌బీనగర్‌లో మహిళా విద్యార్థుల కోసం ప్రత్యేక హాస్టల్ భవనం నిర్మిస్తున్నామని, ప్రభుత్వ సహకారంతో కోకాపేటలో భవన నిర్మాణం కోసం రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించినట్లు వివరించారు. ప్రస్తుతం నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, ఇప్పటికే ఆరు అంతస్తుల వరకు స్లాబ్ పనులు పూర్తయ్యాయని, మొత్తం తొమ్మిది అంతస్తుల భవనాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు.

12 ఏరియాల్లో కమిటీల ఏర్పాటు…….

సింగరేణి పెరిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ట్రస్ట్ ఏర్పాటు చేయడంతో పాటు సింగరేణి పరిధిలోని 12 ఏరియాల్లో ఏరియా కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు వెల్లడించారు. ఇందులో భాగంగా తొలిదశలో శ్రీరాంపూర్ ఏరియా కమిటీని ఏర్పాటు చేశారు.

శ్రీరాంపూర్ ఏరియా కమిటీ:
అధ్యక్షులు: తీర్థాల సదానందం – S&PC
ఉపాధ్యక్షులు: ఆకుల కృష్ణంరాజు
జనరల్ సెక్రటరీ: కారకూరి శ్రీనివాస్
సెక్రటరీ: ఎంబడి శ్రీనివాస్
కోశాధికారి: పేరం మనోహర్

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ అసోసియేట్ అధ్యక్షులు సుంకరి ఆనంద్, కోకాపేట భవన వైస్ చైర్మన్ చుంచు ఉషన్న, పెరిక హాస్టల్ జనరల్ సెక్రటరీ అచ్చ రఘుకుమార్, రాష్ట్ర నాయకులు బోడకుంట ప్రకాష్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కందుల సంధ్యారాణి, జిల్లా అధ్యక్షులు బొడ్డు శంకర్, జిల్లా జనరల్ సెక్రటరీ డా. రాజ్‌కిరణ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు అత్తి సరోజ, అక్కల రమేష్, ఒడ్డె రాజమౌళి, మోటపలకుల తిరుపతి, మేడం తిరుపతి, నెల్కి మల్లేష్, మండల అధ్యక్షులు ఎంబడి కుమారస్వామి, పెట్టెం లక్ష్మణ్, బేర సత్యనారాయణ, రెంక రవి తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.