NIGAMA MEDIA (P) LTD
16.1 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Saturday, October 3, 2026

కొత్త బ్రిడ్జి నిర్మాణానికి గ్రామసభలో తీర్మానం చేయాలి

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

తాత్కాలిక మరమ్మతులతో ప్రయోజనం లేదు..
భారీ వాహనాల రాకపోకలతో ప్రమాదం పొంచి ఉంది

కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):

గ్రామానికి ప్రధాన రహదారిగా ఉన్న బ్రిడ్జి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, నూతన బ్రిడ్జి నిర్మాణానికి వెంటనే నిధులు మంజూరు చేయించాలని గ్రామస్థులు కోరారు. వాయిదాలు వేయకుండా గ్రామసభలో నూతన బ్రిడ్జి నిర్మాణంపై తీర్మానం చేసి సంబంధిత అధికారులకు, ప్రజాప్రతినిధులకు పంపించాలని ముదిరాజ్ సంఘం జిల్లా కార్యదర్శి కొరివి నరసింహులు కోరారు.ఈ సందర్భంగా బీబీపేట గ్రామ సభలో నరసింహులు మాట్లాడుతూ.. ప్రస్తుతం బ్రిడ్జిపై కంకరతో చేపట్టే తాత్కాలిక మరమ్మతులు వర్షాలు, వరదల సమయంలో మళ్లీ కొట్టుకుపోయే ప్రమాదం ఉందన్నారు. అందువల్ల తాత్కాలిక మరమ్మతులకు బదులుగా శాశ్వత పరిష్కారంగా నూతన బ్రిడ్జిని నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు.

ప్రస్తుతం ఇదే ప్రధాన రహదారి కావడంతో సిద్ధిపేట, సిరిసిల్ల, దుబ్బాక, కామారెడ్డి ప్రాంతాలకు వెళ్లే ప్రజలు, వాహనదారులు ఈ బ్రిడ్జిపైనే ఆధారపడుతున్నారని తెలిపారు. బ్రిడ్జి మరమ్మతుల విషయంలో గ్రామస్థులు ఎన్నిసార్లు సమస్యను ప్రస్తావించినా తగిన స్థాయిలో స్పందన కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ సర్పంచ్ గాడి లింగం మాట్లాడుతూ.. గ్రామసభలో ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే వాటిని ప్రభుత్వం లేదా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. గ్రామ సమస్యల పరిష్కారానికి ప్రజల తరఫున పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. అయితే ప్రస్తుత బ్రిడ్జిని కేవలం తాత్కాలిక మరమ్మతులతో కొనసాగించడం సాధ్యమయ్యే పరిస్థితి లేదని పేర్కొన్నారు.

బ్రిడ్జిపై భారీ వాహనాల రాకపోకలు పెరగడంతో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయని గ్రామస్థులు తెలిపారు. ముఖ్యంగా పెద్ద వాహనాలు వరుసగా బ్రిడ్జిపై ప్రయాణిస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే నూతన బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని గ్రామసభలో తీర్మానం చేయాలని కోరారు. అవసరమైతే పరిసర గ్రామాల నుంచి కూడా తీర్మానాలు తీసుకుని, సమస్యను పెద్ద ఎత్తున ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని గ్రామస్థులు అభిప్రాయపడ్డారు. ఇది సరిహద్దు ప్రాంతానికి కీలకమైన బ్రిడ్జి కావడంతో దాని పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని, బ్రిడ్జి సమస్య పరిష్కారానికి ఉపసర్పంచ్ చందుపట్ల ప్రశాంత్ చొరవ తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరారు. 

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.