సింగరేణి పెరిక ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆవిర్భావం
ఉద్యోగ, కార్మిక సమస్యల పరిష్కారానికి కృషి.. 12 ఏరియాల్లో కమిటీల ఏర్పాటు కోల్ బెల్ట్ న్యూస్(శ్రీరాంపూర్): సింగరేణి పెరిక కుల ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆవిర్భావ సమావేశాన్ని శుక్రవారం శ్రీరాంపూర్‌లోని పీవీఆర్ గార్డెన్‌లో సింగరేణి కన్వీనర్ పేరం రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి సుమారు 400 మంది సింగరేణి ఉద్యోగులు హాజరై సంఘంలో సభ్యత్వం స్వీకరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పెరిక సంఘం అధ్యక్షులు గటిక విజయ్‌కుమార్ హాజరై మాట్లాడారు. సింగరేణి సంస్థలో పెరిక కులానికి చెందిన ఉద్యోగులు పెద్ద సంఖ్యలో...