23.9 C
Munich
Wednesday, August 5, 2026

8న మంచిర్యాల లో శతావధానం

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

మూడు రోజుల పాటు వైభవంగా వేడుకలు
ఆధ్యాత్మిక, సాహిత్య కార్యక్రమాలకు ఏర్పాట్లు

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):

మంచిర్యాల జిల్లా సాహితీ సంస్థల సమితి ఆధ్వర్యంలో ప్రముఖ పండితుడు డాక్టర్ మర్రిపల్లి వెంకటరమణతో శతావధాన మహోత్సవం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ మహోత్సవం ఆగస్టు 8, 9, 10 తేదీలలో మూడు రోజుల పాటు జరగనుందన్నారు.

ఈ కార్యక్రమంలో శతావధాన ధురీణులు, శతావధాన మహారథులు, శతావధాన ప్రభాకరులు, శతావధాన ధురంధరులు పాల్గొని సాహిత్యాభిమానులను అలరించనున్నారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమాలు కొనసాగనున్నాయి.

ఈ మహోత్సవం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీలక్ష్మీ నారాయణ (మార్వాడీ) మండపంలో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. జిల్లాతో పాటు రాష్ట్రంలోని సాహిత్యాభిమానులు, కవులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆహ్వానించారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.