NIGAMA MEDIA (P) LTD
23.2 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Saturday, September 19, 2026

బీబీపేట్‌లో ఘనంగా అన్నదాన కార్యక్రమం

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):

బేడ బుడగ జంగం సంఘం వారి ఆధ్వర్యంలో బీబీపేట్ గ్రామంలో శనివారం అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గజానన యూత్ సభ్యుల సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి గ్రామంలోని ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా గ్రామంలోని వివిధ కుల సంఘాల పెద్దలు, యువత, మహిళలు, అన్ని వర్గాల ప్రజలతో పాటు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు కూడా పార్టీలకు అతీతంగా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలో ఐక్యత, సోదరభావాన్ని చాటుతూ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించారు.

అన్నదాన కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించడంతో గజానన యూత్ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. సమాజంలో సేవా భావాన్ని పెంపొందించడంతో పాటు, అన్ని వర్గాల ప్రజలను ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా ఇటువంటి కార్యక్రమాలు సామాజిక ఐక్యతకు దోహదపడతాయని వారు పేర్కొన్నారు.కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గ్రామస్తులు, కుల సంఘాల పెద్దలు, యువత, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలకు గజానన యూత్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.