8న మంచిర్యాల లో శతావధానం

మూడు రోజుల పాటు వైభవంగా వేడుకలు ఆధ్యాత్మిక, సాహిత్య కార్యక్రమాలకు ఏర్పాట్లు కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): మంచిర్యాల జిల్లా సాహితీ సంస్థల సమితి ఆధ్వర్యంలో ప్రముఖ పండితుడు డాక్టర్ మర్రిపల్లి వెంకటరమణతో శతావధాన మహోత్సవం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ మహోత్సవం ఆగస్టు 8, 9, 10 తేదీలలో మూడు రోజుల పాటు జరగనుందన్నారు. ఈ కార్యక్రమంలో శతావధాన ధురీణులు, శతావధాన మహారథులు, శతావధాన ప్రభాకరులు, శతావధాన ధురంధరులు పాల్గొని సాహిత్యాభిమానులను అలరించనున్నారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల...