36 C
Munich
Thursday, July 30, 2026

సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

ఉమ్మడి జిల్లా డీఆర్‌పీ గర్దాసు సుధాకర్

కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):

వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వేగంగా వ్యాపించే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైఆర్‌జీ కేర్ లింక్ వర్కర్ స్కీం ఉమ్మడి జిల్లా డీఆర్‌పీ గర్దాసు సుధాకర్ సూచించారు. గురువారం బీబీపేట్ మండల కేంద్రంలోని గ్రామ సంఘం కార్యాలయంలో గ్రామ సంఘాల సభ్యులతో ప్రత్యేక అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ వంటి అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం ఎక్కువగా ఉందన్నారు.

ప్రజలు తమ ఇళ్లు, పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నిల్వ నీరు ఉండకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. దోమల నివారణకు దోమతెరలు, దోమల నివారణ మందులు వినియోగించాలని, పూర్తి స్థాయిలో పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోవాలని తెలిపారు.

చర్మ, సుఖ వ్యాధులను నిర్లక్ష్యం చేయొద్దు…..

చర్మవ్యాధులు, సుఖవ్యాధులు వంటి ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ప్రారంభ దశలోనే వైద్యులను సంప్రదించాలని సుధాకర్ సూచించారు. ఏవైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే స్వయంగా మందులు వాడకుండా ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు.

ప్రభుత్వ వైద్య సేవలను వినియోగించుకోవాలి…..

ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సీజనల్ వ్యాధుల నివారణ చర్యలు, వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్య పరిరక్షణపై సభ్యులకు విస్తృతంగా అవగాహన కల్పించారు.

ఈ సమావేశంలో క్లస్టర్ లింక్ వర్కర్ బాలకిషన్, గ్రామ సంఘాల ప్రతినిధులు, వివోలు (VOs) తదితరులు పాల్గొన్నారు.

 

 

 

 

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.