NIGAMA MEDIA (P) LTD
14.8 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Monday, September 14, 2026

సింగరేణి సకల జనుల సమ్మె నమ్మకాన్ని నిలబెట్టుకుందాం!

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

కార్మికుల హక్కుల సాధనకు పోరాడుదాం
టీబీజీకేఎస్ అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య

కోల్ బెల్ట్ న్యూస్(గోదావరిఖని):

సకల వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందించి నిలిచిన నేల ఇది. నాగేటి చాళ్లపై పెళ్లుబికిన రైతాంగ పోరాటాలకు సాక్ష్యమైన తెలంగాణలో, సింగరేణి గని కార్మికులు ఎన్నో హక్కుల సాధన కోసం పోరాటాలు సాగించారు. ధిక్కార పోరాటాలకు సమరాంగణంగా నిలిచిన ఈ గని కార్మికుల గడ్డను మరింత అభివృద్ధి పథంలో నడిపించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని టీబీజీకేఎస్ అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య అన్నారు. సోమవారం ఆయన గోదావరిఖనిలో సింగరేణిలో సెప్టెంబర్ 13 నుంచి అక్టోబర్ 17 వరకు 35 రోజుల పాటు జరిగిన సకల జనుల సమ్మెను గుర్తుకు చేసుకుంటూ మాట్లాడారు.

సమ్మె నేపథ్యంలో సింగరేణిలో తట్టెడు బొగ్గు కూడా బయటకు రాలేదు. దింతో దేశంలోని అనేక విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి నిలిచి పోయే పరిష్టితి ఏర్పడింది. సాక్షాత్తు అప్పటి దేశ ప్రధాన మంత్రి సమ్మె విషయంలో జోక్యం చేసుకొని సమ్మె విరమించాలని కోరినప్పటికీ ఫలితం కానరాలేదు. పలువురు కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు సైతం జైలుకు వెళ్లేవారు. అయినప్పటికీ కార్మికులు వెనుకంజ వేయకుండా సమ్మెను తెలంగాణ సాధన కోసం కొనసాగించడం అభినందనీయమన్నారు కెంగర్ల మల్లయ్య.

సకల జనుల సమ్మె మాదిరిగానే కార్మికులు తమ అపరిష్కృత సమస్యల పరిస్కారం కోసం ముందడుగు వేయాలని ఈ సందర్బంగా కెంగర్ల మల్లయ్య సింగరేణి కార్మిక వర్గాలను కోరారు. తెలంగాణ ప్రభుత్వం సింగరేణి సంస్థకు రావాల్సిన రూ : 52 వేల కోట్ల రూపాయలను వెంటనే ;చెల్లించాలని మల్లయ్య ఈ సంధర్బంగా డిమాండ్ చేశారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.