సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
ఉమ్మడి జిల్లా డీఆర్‌పీ గర్దాసు సుధాకర్ కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట): వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వేగంగా వ్యాపించే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైఆర్‌జీ కేర్ లింక్ వర్కర్ స్కీం ఉమ్మడి జిల్లా డీఆర్‌పీ గర్దాసు సుధాకర్ సూచించారు. గురువారం బీబీపేట్ మండల కేంద్రంలోని గ్రామ సంఘం కార్యాలయంలో గ్రామ సంఘాల సభ్యులతో ప్రత్యేక అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ వంటి అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం ఎక్కువగా ఉందన్నారు....