28.2 C
Munich
Thursday, July 30, 2026

‘శంకరవరప్రసాద్’ 200 రోజుల విజయోత్సవం

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

మెగాస్టార్ చిరంజీవి నటనకు ప్రేక్షకుల బ్రహ్మరథం
ఘనంగా అన్నదానం నిర్వహించిన థియేటర్ యాజమాన్యం, అభిమానులు

కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:

ఎర్రగుంట్ల పట్టణంలోని హేమ థియేటర్‌లో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన “శంకరవరప్రసాద్” చిత్రం విజయవంతంగా 200 రోజుల ప్రదర్శనను పూర్తి చేసుకుంది. ప్రేక్షకుల నుంచి అపూర్వ ఆదరణ పొందిన ఈ చిత్రం అరుదైన ఘనతను సాధించడంతో థియేటర్ యాజమాన్యం, చిరంజీవి అభిమానులు సంయుక్తంగా ప్రత్యేక వేడుకలను నిర్వహించారు. ఈ విజయోత్సవాన్ని పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం నిర్వహించి, అభిమానులు, సినీ ప్రేక్షకులు, స్థానిక ప్రజలకు భోజనాలు వడ్డించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొని మెగాస్టార్ చిరంజీవిపై తమ అభిమానాన్ని చాటుకున్నారు.

ఈ సందర్భంగా అభిమానులు మాట్లాడుతూ, “శంకరవరప్రసాద్” చిత్రం కథ, చిరంజీవి నటన, భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయని పేర్కొన్నారు. 200 రోజుల విజయాన్ని సాధించడం చిత్ర విజయానికి నిదర్శనమని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో థియేటర్ యాజమాన్యం, చిరంజీవి అభిమాన సంఘాల ప్రతినిధులు, స్థానిక ప్రముఖులు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని విజయోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.

 

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.