24.4 C
Munich
Sunday, July 26, 2026

Singareni : మే 20న సింగరేణిలో సమ్మె

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd ,RNI No : 192138/2024, Date : 20-12-2024, Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

Singareni : కార్మికుల హక్కులను కాపాడుకోడానికి మే 20న కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా బొగ్గు పరిశ్రమల్లో కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. అందులో భాగంగా సింగరేణి కార్మికులు పాల్గొను విజయవంతం చేయాలని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని RK 6, SRP 1 గనులపై గేట్ మీటింగ్ నిర్వహించారు జెఎసి నాయకులు. ఈ సందర్బంగా నాయకులు కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ …….

కార్మికులు సాధించుకున్న 44చట్టాలను 4 లేబర్ కోడ్ లుగా విభజించి కార్మికులను కేవలం పని యంత్రాలుగా మార్చి కట్టు బానిసలా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలను చేస్తున్నదని ఆరోపించారు. 8 గంటల పని దినాలను 12 గంటలుగా మార్చడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు. దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి పెట్టుబడిదారుల చేతిలో పెట్టడానికి కూడా కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు.

కొత్త చట్టాలను అమలు చేసి జాతీయ సంపద అయిన బొగ్గు గనులను కూడా ప్రైవేటీకరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందన్నారు. బ్యాంకింగ్, రవాణా సంస్థ తదితర ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుపరం చేసేలా ఈ చట్టాలు ఉన్నాయని జేఏసీ నాయకులు ఈ సందర్బంగా ఆరోపించారు. భవిష్యత్తులో కార్మికుల మనుగడ కొనసాగాలంటే కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకు వస్తున్న 4 లేబర్ కోడ్ లను రద్దు చేసేవరకు పోరాటాలు చేయాల్సిందేనన్నారు. మే 20న జరిగే సార్వత్రిక సమ్మెలో సింగరేణి కార్మిక వర్గం అంతా స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని వారు కోరారు.

ఈ కార్యక్రమంలో గుర్తింపు సంఘం ఏఐటీయూసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కందికట్ల వీరభద్రయ్య, ముష్కి సమ్మయ్య, బ్రాంచ్ కార్యదర్శి ఎస్ కే బాజీ సైదా, సహాయ కార్యదర్శి మోత్కూరి కొమురయ్య, ఐఎన్టీయూసీ కేంద్ర ఉపాధ్యక్షులు జట్టి శంకర్రావు, కలవేన కుమారస్వామి, గరిగేస్వామి, తిరుపతి రాజు, సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి, బాలాజీ, చంద్రశేఖర్, టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి సురేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు పెట్టం లక్ష్మణ్, పొగాకు రమేష్, తదితరులు పాల్గొన్నారు.

Author

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.