NIGAMA MEDIA (P) LTD
21.4 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Sunday, September 13, 2026

Singareni : సింగరేణిలో కొత్త గనుల నిర్మాణం

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

బొగ్గు నిల్వలు ఉండి మూతబడిన గనుల్లో ఉత్పత్తి
మందమర్రిలో మరో మరో రెండు కొత్త గనులు
ప్రభుత్వ, INTUC సహకారంతో ప్రగతిపథంలో సింగరేణి
INTUC కేంద్ర కమిటీ సీనియర్ ఉపాధ్యక్షులు కాంపెల్లి సమ్మయ్య

Singareni : కొత్త భూగర్భ , ఓపెన్ కాస్ట్ గనులను నిర్మించడానికి సింగరేణి యాజమాన్యం పలు నిర్ణయాలు తీసుకున్నదని INTUC కేంద్ర కమిటీ సీనియర్ ఉపాధ్యక్షులు కాంపెల్లి సమ్మయ్య తెలిపారు. శ్రీరాంపూర్ లో ఆయన మాట్లాడుతూ బొగ్గు నిల్వలు ఉండి, పలు సాంకేతిక కారణాలతో మూత పడిన గనులను కూడా తిరిగి ప్రారంభించడానికి సంబంధిత అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని సమ్మయ్య ఈ సందర్బంగా వివరించారు. ఈ గనుల్లో ఉత్పత్తి ప్రారంభమైతే ఉద్యోగ,ఉపాధి అవకాశాలతోపాటు సంస్థ మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.

INTUC సెక్రెటరీ జనరల్ జనక్ ప్రసాద్ చొరవ తీసుకొని కొత్త గనుల ఏర్పాటుతో పాటు మూతబడిన గనులను తిరిగి ప్రారంభించే విషయాలపై సింగరేణి సి అండ్ ఎండి తో చర్చలు జరపడం జరిగిందన్నారు. అదే విదంగా ఒకపైపు సంస్థ చైర్మన్ తో పాటు రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తో కూడా సంస్థ అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన నిర్ణయాలపై పలుమార్లు చర్చించడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలోనే కాంట్రాక్టు కార్మికులకు లాభాల్లో వాటా ఇవ్వడానికి చైర్మన్ అంగీకరించడం జరిగిందన్నారు.

తెలంగాణ ఏర్పడిన తరువాత గత పాలకులు కాంట్రాక్టు కార్మికుల సమస్యల గురించి పట్టించుకోలేదన్నారు. వారి స్వార్ధపూరిత రాజకీయాల వలన సంస్థ ఆర్థిక నష్టాల్లోకి వెళ్లడంతో పాటు కార్మికులు కూడా అనేక కష్టాలను ఎదుర్కొన్నారని సమ్మయ్య ఈ సందర్బంగా ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత సింగరేణిలో యూనియన్ అధికారంలోకి రాకపోయినప్పటికీ కాంట్రాక్టు కార్మికులకు లాభాల వాటా ఇప్పించి ఆర్థికంగా యూనియన్ ఆదుకొన్నదని స్పష్టం చేశారు.

ఐఎన్టీయూసీ నేత జనక్ ప్రసాద్ చొరవ తీసుకోని నైని బ్లాక్ గనిని ప్రారంభించే విదంగా ప్రభుత్వంతో చర్చలు జరిపిన ఫలితమే నైని బ్లాక్ ఒక తార్కాణమన్నారు సమ్మయ్య. జనక్ ప్రసాద్ చొరవ తీసుకుని చైర్మన్ తో చర్చించగా మందమర్రి ఏరియాలో కొత్తగా KK 6 గని తోపాటు, ఆర్కే ఓసి వీలైనంత త్వరగా పనులు ప్రారంభించడానికి యాజమాన్యం అంగీకారం తెలిపిందన్నారు. ఈ రెండు గనుల ద్వారా మందమర్రి ఏరియాకు మంచి భవిష్యత్తు వస్తుందన్నారు. అదే విదంగా చెన్నూర్ లో మూత బడిన గనులను తిరిగి ప్రారంభించడానికి యాజమాన్యంతో చర్చలు జరిపి జనక్ ప్రసాద్ ఒప్పించడం జరిగిందన్నారు. కార్మికులు, వారి కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం కూడా జనక్ ప్రసాద్ చైర్మన్ బలరాం నాయక్ తో చర్చలు జరిపి ఒప్పించడం జరిగిందన్నారు. హైద్రాబద్ లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం, గోదావరిఖనిలో గుండె జబ్బులకు చికిత్స అందించడానికి ప్రత్యేక ఆసుపత్రి నిర్మించడానికి చైర్మన్ అంగీకారం తెలుపడం జరిగిందన్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.