NIGAMA MEDIA (P) LTD
21.4 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Sunday, September 13, 2026

ఓపెన్ కాస్ట్ గనుల పనివేళల్లో మార్పు

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

singareni mine duty timings: సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో పని వేళలను మార్చడానికి సింగరేణి యాజమాన్యం అంగీకరించిందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వాసిరెడ్డి సీతారామయ్య, కె రాజ్ కుమార్ లు తెలిపారు. సింగరేణి సి అండ్ ఎండీ బలరాం ను కలిసి వేసవిలో అధిక ఉష్ణోగ్రత ను ఓపెన్ కాస్ట్ గనుల్లో పనిచేసే అధికారులు, కార్మికులు తట్టుకోలేకపోతున్నారని వివరించారు. కార్ముకులు అలసిపోయి విధులు నిర్వహించలేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. కార్మికులు శారీరకంగా నష్టపోకుండా ఉండేందుకు పనివేళలు మార్చాలని కోరామని తెలిపారు. వేసవి ఉష్ణోగ్రత తోపాటు కార్మికుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పనివేళలను మార్చడానికి అంగీకరించారని ఏఐటీయూసీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తెలిపారు.

ఫస్ట్ షిఫ్ట్ 7 నుండి 1 వరకు, సెకండ్ షిఫ్ట్ 4 నుండి 11వరకు మార్చాలని ప్రతిపాదించగా ఛైర్మెన్ సోమవారం సాయం త్రం 4 గంటలకు జనరల్ మేనేజర్ ర్లతో వీడి యో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి ఏరియాలో బొగ్గు ఉత్పత్తికి నష్టం జరుగకుండా సర్దుబాటు చేసుకోవడానికి అనుమతి ఇవ్వడం జరిగిందని ఏఐటీయూసీ నాయకులు తెలిపారు. అన్ని ఏరియాల జనరల్ మేనేజర్ లు బొగ్గు ఉత్పత్తికి నష్టం వాటిల్ల కుండా ఒప్పుకుంటే ఈ పనివేళలు అమలవుతాయని వారు తెలిపారు. ఒప్పుకొని నేపథ్యంలో పాతపద్ధతి మాదిరిగానే 7 నుండి 3వరకు,3 నుండి 11వరకు,11నుండి 7 వరకు ఉంటాయని ఏఐటీయూసీ నాయకులు వివరించారు.

నవంబర్ 30న నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికలలోవిధులు నిర్వహించిన వారితోపాటు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఈనెల 13 న ఎన్నికల విధులు నిర్వ ర్తించే మినిస్టీరియల్ స్టాఫ్,సెక్యూరిటీ సిబ్బందికి కూడా ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే విదంగా సింగరేణి ఉద్యోగులకు కూడా వర్తింప చేయడానికి సి అండ్ ఎండి అంగీకరించారని ఏఐటీయూసీ నాయకులు తెలిపారు.

 

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.