16.6 C
Munich
Monday, July 27, 2026

పసుపు,చెక్కరతో పోరాటం

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

కోల్ బెల్ట్ ప్రతినిధి:
నిజామాబాద్ పార్లమెంట్ స్థానాన్ని దక్కించుకోడానికి తెలంగాణ ముఖ్యమంత్రి ప్రత్యర్థులకు చిక్కకుండా ప్రచారం చేస్తున్నారు. నిజామాబాద్ స్థానం నుంచి జీవం రెడ్డి బరిలో ఉన్నారు.ఒకరకంగా చెప్పాలంటే ఆయనను గెలిపించుకోడానికి ప్రధాన అభ్యర్థులతో పోరాటం చేస్తున్నట్టులేదు. పసుపు బోర్డు,చెక్కర ఫ్యాక్టరీ లతో పోరాటం చేస్తున్నట్టు ప్రజల్లో చర్చ జరుగుతోంది. 2014 ఎన్నికల్లో కవిత ఎంపీగా గెలిచింది.2019 ఎన్నికల్లో ధర్మపురి అరవింది అదేస్థానం నుంచి ఎంపీగా గెలిచారు.ఈ ఇద్దరు కూడా పసుపు బోర్డు హామీ ఇచ్చారు. కానీ ఆ హామీ నెరవేరలేదు. తాజా ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి అదే హామీతో ప్రజల్లోకి వెళుతున్నారు.పసుపు బోర్డు తోపాటు బోధన్ లో మూతపడిన చెక్కర ఫ్యాక్టరీని తిరిగి పునః ప్రారంభిస్తానని రేవంత్ రెడ్డి హామీ ఇస్తున్నారు.పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ చక్కెర కర్మాగారాన్ని పట్టించుకోలేదు.అదేవిదంగా ఎంపీగా గెలిచిన కవిత తోపాటు అరవింద్ కూడా పట్టించుకోలేదని ఆరోపిస్తూ తనదయిన శైలిలో ఆరోపణలు గుపిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి.

జీవన్ రెడ్డి ని మంత్రిని చేస్తా ….
కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాబోతోంది. నిజామాబాదు నుంచి ఎంపీగా జీవన్ రెడ్డి ని గెలిపించి ఢిల్లీ పంపే భాద్యత మీరు తీసుకోండి.సోనియా గాంధీ,రాహుల్ గాంధీ ని ఒప్పించి జీవన్ రెడ్డిని కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రిగా నియమించే భాద్యత నేను తీసుకుంటా.అప్పుడు మీకు ఇస్తున్న పసుపు బోర్డు, చెరుకు ఫ్యాక్టరీ హామీలను నెరవేర్చే భాద్యత నాది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా చెరుకు ఫ్యాక్టరీని మాత్రం సెప్టెంబర్ 17 తిరిగి ప్రారంభించడానికి చర్యలు చేపడుతా.పార్లమెంట్ ఎన్నికలు పూర్తి కాగానే చెరుకు కంపెనీ ప్రారంభించడానికి ప్రణాలికను తాయారు చేయిస్తా అంటూ నిజామాబాదు లో సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రచారం బీజేపీ,బిఆర్ఎస్ అభ్యర్థులకు ఇబ్బందికి గురిచేస్తోందనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి.

—————————
ఎడిటర్: పీఆర్ యాదవ్
9603505050
—————————-

 

 

Author

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.