16.6 C
Munich
Monday, July 27, 2026

ఒక్క ఫయిటింగ్ షూటింగ్ కోసం 26 రోజులు కష్టపడిన హీరో

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

కోల్ బెల్ట్ ప్రతినిధి:
సినిమా విడుదల అవుతోందంటేనే అభిమానులు ఎన్నో ఆశలతో ఉంటారు.అభిమానులకు కావాల్సింది డాన్స్,ఫయిటింగ్, సంగీతము, పాటలు.పాట,మ్యూజిక్ కు తగిన విదంగా హీరో,హీరోయిన్ ల డాన్స్ ఉండాలి. వీటికి తోడుగా హీరో ఫయిటింగ్ ఉండి తీరాల్సిందే. విలన్,అతని అనుచరులతో చేసే పోరాటాలు భారీ సెట్టింగ్ లతో ఉండితీరాలి.ఇంకా చెప్పాలంటే హీరో డూప్ లేకుండా విలన్ అతని అనుచరులతో కొట్లాడితే ఇంకా ఆ సినిమాకు క్రేజీ పెరుగుతుంది.అప్పుడే ఆ సినిమా విజయవంతం అవుతుంది.ప్రముఖ హీరోల సినిమా వస్తోందంటే వాళ్ళ అభిమానులు ఆనందంలో మునిగిపోతారు.అభిమానుల ఆశయాలకు తగ్గట్టుగా హీరోలు చాల జాగ్రత్తలు షూటింగ్ సమయంలో తీసుకుంటారు.షూటింగ్ సెట్లో ఎన్ని అవాంతరాలు ఎదురైనా రాజీకి అవకాశం ఇవ్వకుండా షూటింగ్ పూర్తి చేస్తారు.

విశ్వంభర కోసం 26 రోజులు షూటింగ్….
యూ.వి క్రియేషన్ పతాకంపై ప్రధాన కథానాయకుడు చిరంజీవి హీరోగా విశ్వంభర షూటింగ్ నడుస్తున్నది అభిమానులకు తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేయడానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు చిరంజీవి.విశ్వంభర సినిమా ముగింపు దశకు ముందు చిరంజీవి స్థాయికి తగిన విదంగా ఫయిటింగ్ దృశ్యాలను తెరకెక్కిస్తున్నారు.ఈ ఫయిటింగ్ దృశ్యాన్ని చిత్రీకరించడానికి అక్కడ 54 అడుగుల ఎత్తున్న భారీ ఆంజనేయస్వామి విగ్రహాన్ని ఏర్పాటుచేశారు.ఫయిటింగ్ దృశ్యాలు ఇప్పటివరకు భారతీయ సినిమాల్లో ఎవరు కూడా చేయని విదంగా ఉంటాయని విశ్వంభర సినిమా సాంకేతిక వర్గం చెబుతోంది.యాక్షన్ కొరియో గ్రాఫర్లు గ రామ్-లక్ష్మణ్ లు చిరంజీవి స్థాయికి తగ్గట్టుగా ప్రత్యేక సెట్ వేయించారు.చిరంజీవి తన సినీ కెరీర్ లో ఇప్పటివరకు చేయని ఫయిటింగ్ దృశ్యాలను విశ్వంభరలో అభిమానులు చూడబోతున్నారు.చిరంజీవి ఇప్ప్పటివరకు ఒక్క ఫయిటింగ్ కోసం 26 రోజుల సమయాన్ని కేటాయించిన సందర్భం కూడా లేదని సినీవర్గాలు చెబుతున్నాయి.ఇప్పుడు మాత్రం విశ్వంభర సినిమా విరామం కు ముందు వచ్చే ఫయిటింగ్ కోసం చిరంజీవి 26 రోజులు కష్టపడక తప్పలేదని ఆ సినిమా సాంకేతిక వర్గం అభిప్రాయపడుతోంది.

—————————
ఎడిటర్: పీఆర్ యాదవ్
9603505050
—————————-

Author

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.