NIGAMA MEDIA (P) LTD
12.4 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Thursday, September 17, 2026

వైసీపీ మేనిఫెస్టో ఎక్కడ,ఎవరు తయారు చేస్తారో తెలుసా …???

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

కోల్ బెల్ట్ ప్రతినిధి:
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని చేజిక్కించుకొని రికార్డు సృష్టించాలని చూస్తున్నాడు.ప్రతిపక్ష పార్టీలకు చిక్కకుండా దూసుకుపోతున్నారు.బస్సు యాత్రల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.అభ్యర్థులను ఈపాటికే ప్రకటించారు.ఒకవైపు తట్టుకోలేని విదంగా ఇంటిపోరు.చెల్లెలు ప్రచారం తీరుతో సతమతమవుతున్నాడు.షర్మిల విమర్శలను తట్టుకొని ముందుకు వెళుతున్నప్పటికిని,ఎదో కొంత వెనుకబాటుతనం స్పష్టమవుతోంది వైసిపి అభ్యర్థుల్లో.మరోవైపు బిజెపి,జనసేన, తెలుగు దేశం కూటమిగా ఏర్పడింది.జగన్ ఇంటిముఖం పట్టించడానికి రెండువైపులా పోరు సాగుతోంది.అయినప్పటికిని 2019 ఎన్నికల్లో ఒంటరిగా బరిలో దిగి విజయం సాధించిన జగన్ రెండోసారి కూడా విజయపతాకాన్ని ఎగురవేయాలని ప్రచారంలో దూసుకెళుతున్నాడు.

అన్నీ తానై ప్రచారం …
ఒకవైపు అభ్యర్థుల గెలుపు భాద్యతలను భుజాన వేసుకున్నాడు. విజయం,అపజయంకు భాద్యత తానే భరించనున్నాడు.ప్రచారంలో ఎక్కడ కూడా తేడా రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.బస్సు యాత్రలో అక్కడక్కడ జనసమీకరణ ఆశించిన మేరకు ఉండటంలేదు.ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయాలు రోజు,రోజుకు వేడెక్కుతున్నాయి. పోటాపోటీగా ప్రచారం సాగుతోంది. ముందస్తుగా అభర్ధులను ప్రకటించాడు. సిద్ధం పేరుతో సభలు నిర్వహిస్తున్నాడు జగన్. బస్సు యాత్ర పేరుతో సమావేశాలు పెట్టి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు.వైసీపీ ఇచ్చిన హామీలన్నిటిని నెరవేర్చినానని తన ప్రచారంలో వివరిస్తున్నాడు. మరోసారి అధికారం ఇస్తే అన్ని వర్గాల వారికి మేలుచేసేవిదంగ తన పరిపాలన ఉంటుందని హామీ ఇస్తున్నాడు. వైసీపీ ఎన్నికల ఎం మేనిఫెస్టో విడుదల అయ్యాక ప్రతిపక్షాలు తమ ప్రచారం మానివేసి ఇంటికి పరిమిత అవుతారని అన్నారు.గత ఎన్నికల సందర్బంగా విడుదల చేసిన నవరత్నాల మేనిఫెస్టో కంటే ప్రజలు బ్రహ్మరథం పట్టేవిదంగా ఉంటుందంటున్నాడు.

మేనిఫెస్టో….
వైసీపీ తన ఎన్నికల మేనిఫెస్టో తయారీలో నిమగ్నమైనది.రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి మేలుచేసేవిదంగా ఉండాలని తాయారు చేస్తోంది. తొందరలోనే మేనిఫెస్టోను విడుదల చేయనున్నామని వైసీపీ నేతలు చెబుతున్నారు.మేనిఫెస్టో తయారుకు విశాఖపట్టణం వేదిక కాబోతుంది.ఉత్తరాంధ్ర నేతలతో కలిసి విశాఖ లోనే మేనిఫెస్టో తయారుచేస్తున్నారు.2019 ఎన్నికల్లో నవరత్నాల పేరుతో విడుదల చేసిన మేనిఫెస్టోతో విజయం సాధించింది జగన్ పార్టీ. మరో రెండు రోజుల్లో విశాఖ కేంద్రముగా విడుదల అయ్యే మేనిఫెస్టోపై వైసిపి అభ్యర్థులు భారీ ఎత్తున ఆశలు పెట్టుకున్నారు.

—————————
ఎడిటర్: పీఆర్ యాదవ్
9603505050
—————————-

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.