NIGAMA MEDIA (P) LTD
5.9 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Tuesday, November 3, 2026

మందమర్రి ఏరియా బీసీ లైజన్ ఆఫీసర్‌గా పి. రాజు

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

నూతన బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఘన సన్మానం
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):

సింగరేణి మందమర్రి ఏరియా బీసీ లైజన్ ఆఫీసర్‌గా నూతనంగా ఎంపికైన పి. రాజు (అడిషనల్ మేనేజర్, శాంతిఖని)కు మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో ఘనంగా సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఏరియా ఉన్నతాధికారులు, వివిధ బీసీ సంఘాల నాయకులు సైతం పి. రాజును శాలువాలతో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ మాట్లాడుతూ.. నూతనంగా బీసీ లైజన్ ఆఫీసర్ బాధ్యతలు చేపట్టిన పి. రాజు బీసీ ఉద్యోగులు, కార్మికుల సంక్షేమానికి నిరంతరం అందుబాటులో ఉంటూ విశేష సేవలు అందించాలని ఆకాంక్షించారు. యాజమాన్యానికి, బీసీ ఉద్యోగులకు మధ్య వారధిగా ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు. కంపెనీ పురోగతిలో బీసీ ఉద్యోగుల పాత్ర కీలకమని, అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని పేర్కొన్నారు.

అనంతరం సన్మాన గ్రహీత పి. రాజు మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన సింగరేణి యాజమాన్యానికి, తనకు మద్దతుగా నిలిచిన బీసీ సంఘాల నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బీసీ ఉద్యోగులు, కార్మికుల న్యాయమైన హక్కులు, సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం బాధ్యతాయుతంగా నిరంతరం కృషి చేస్తానన్నారు. యాజమాన్య నియమ నిబంధనలకు కట్టుబడి, అందరి సహకారంతో ఏరియా అభివృద్ధికి, బీసీ ఉద్యోగుల సంక్షేమానికి అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ ఎస్. సత్యనారాయణ, శాంతిఖని ఏజెంట్ సంతోష్ కుమార్, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ మురళి, డీజీఎం (పర్సనల్) సీహెచ్. అశోక్, టీబీజీకేఎస్ వైస్ ప్రెసిడెంట్ మేడిపల్లి సంపత్, మందమర్రి ఏరియాలోని వివిధ విభాగాల ఉన్నతాధికారులు, బీసీ సంఘాల నాయకులు, ప్రతినిధులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.