23.7 C
Munich
Thursday, July 30, 2026

అంత్యోదయకార్డు లబ్దిదారులకు గుడ్ న్యూస్

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

కోల్ బెల్ట్ న్యూస్:హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన లబ్దిదారులకు తెల్లకార్డు ద్వారా పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. విద్య,వైద్య సదుపాయాలను అందుబాటులోకి తీసుకువచ్చింది.కార్డు ద్వారా బియ్యం పంపిణి చేస్తోంది.తాజాగా అంత్యోదయ కార్డు ఉన్నవారికి తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే కొత్తగా శుభవార్త ప్రకటించింది.డిటో అంత్యోదయ అన్న యోజన రేషన్ కార్డు ఉన్నవారికి పౌర సరఫరాల శాఖ ద్వారా గతంలో రద్దు ఆయిన పథకాన్ని తిరిగి ప్రవేశ పెట్టింది.ప్రభుత్వ ఆదేశాల మేరకు అంత్యోదయ కార్డు ఉన్నవారికి మేలుజరుగనుంది.
AAY కార్డు కు 35 కిలోల బియ్యం
అంత్యోదయ అన్న యోజన రేషన్ కార్డు ఉన్న లబ్దిదారులకు ప్రతినెల ప్రతి కుటుంబానికి 35 కిలోల బియ్యాన్ని ఉచితంగా అందజేస్తుంది.బియ్యం అందుబాటులో లేని రోజుల్లో 35 కిలోల గోధుమలను పంపిణీచేస్తోంది. ఇప్పటి వరకు బియ్యం లేదా గోధుమల్లో ఎదో ఒకటి తప్పనిసరిగా దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు రేషన్ డీలర్లు ప్రభుత్వ పౌర సరఫరాల శాఖా ఆదేశాల మేరకు
సరఫరా చేస్తున్నారు. కానీ చెక్కర మాత్రం పంపిణి చేయడం లేదు.
చాయ్ మానేశారు
డీలర్లు చక్కెర కోసం పౌరసరఫరాల శాఖకు చెల్లించినప్పటికిని ఆ శాఖ ముందుకు రాకపోవడంతో పేద కుటుంబాలు మార్కెట్లోఎక్కువ ధరకు చక్కెర కొనుగోలుచేశారు.చక్కెర కొనుగోలు చేయనివారు చాయ్ కూడ తాగడం మానేశాయి పలు కుటుంబాలు.ప్రస్తుతం మార్కెట్ లో కిలో చక్కెర నలబై రూపాయలు ఉంది. అదే రేషన్ డీలర్ వద్ద కొనుగోలు చేసినచో 13 నుంచి 15 రూపాయల మధ్య దొరుకుతుంది. రాష్ట్రంలో సుమారు ఆరు లక్షల అంత్యోదయ కార్డులు ఉన్నవి. రాష్ట్రంలో 17వేల మంది డీలర్లు ఉన్నారు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను పౌరసరఫరాల శాఖ అమలుచేయడానికి సిద్ధంగా ఉంది.అందుకు తగిన విదంగా రేషన్ డీలర్లు సైతం చెక్కర సరఫరా చేయడానికి ముందుకు రావాల్సిన అవసరం ఉందని అంత్యోదయ అన్న యోజన రేషన్ కార్డు లబ్ధిదారులు కోరుతున్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.