కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):
బిబిపేట వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన గణేష్ మండపంలో శుక్రవారం వాసవి మహిళలు, ఆర్యవైశ్య మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కుంకుమార్చన పూజలు నిర్వహించారు. అర్చకులు మనోజ్ పాండే ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసాగాయి.
అనంతరం మంగళహారతులు నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ వైస్ గవర్నర్ భాశెట్టి నాగేశ్వర్, అధ్యక్షుడు మురికి శ్రీనివాస్, కార్యదర్శి రెడ్డిశెట్టి శ్రీనివాస్, బచ్చు రాజు, బచ్చు చంద్రశేఖర్, తోడుపునూరు సాయిచందు తదితరులు పాల్గొన్నారు.

