తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ సలేంద్ర కొమురయ్య యాదవ్
కోల్ బెల్ట్ న్యూస్(పెద్దపల్లి):
ఈ నెల 20న కోస్గి కాలేజ్ గ్రౌండ్లో నిర్వహించనున్న పాంచజన్య సంకల్ప సభకు తెలంగాణ ప్రజలు, ఉద్యమకారులు, విద్యార్థులు, ఉద్యోగులు, తెలంగాణ రక్షణ సేన కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ సలేంద్ర కొమురయ్య యాదవ్ పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమకారులు, విద్యార్థులు, ఉద్యోగులు, సబ్బండ వర్గాల ప్రజలు ఎన్నో త్యాగాలు చేశారని అన్నారు. వారి త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో రాష్ట్ర వనరులు, భూముల విషయంలో అన్యాక్రాంతాలు, అవకతవకలు జరిగాయని ఆరోపించారు.
తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తే రాష్ట్రానికి చెందిన వనరులు, భూముల విషయంలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపడతామని తెలిపారు. అక్రమాలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించబోమని పేర్కొన్నారు. అక్రమార్కుల నుంచి స్వాధీనం చేసుకున్న భూములను ‘భూలక్ష్మి’ పథకం ద్వారా నిరుపేదలకు ఎకరం చొప్పున పంపిణీ చేస్తామని వెల్లడించారు.
సామాజిక న్యాయం సాధించడమే తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత లక్ష్యమని సలేంద్ర కొమురయ్య యాదవ్ పేర్కొన్నారు. పాంచజన్య సంకల్ప సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు.

