23.7 C
Munich
Thursday, July 30, 2026

చిరంజీవికి పవన్ కళ్యాణ్ పాదాభివందనం

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

కోల్ బెల్ట్ న్యూస్:హైదరాబాద్
చిరంజీవి ఒక ప్రముఖ నటుడు.ఆ తరువాత రాజకీయాల్లోకి.సొంతంగా పార్టీని స్థాపించడం.పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం.రాజ్యసభకు ఎంపిక కావడం.కేంద్రంలో మంత్రిగా భాద్యతలు చేపట్టడం.తిరిగి రాజకీయనాలు వదిలిపెట్టడం.మళ్ళీ మేకప్ వేసుకోవడడం ఇదంతా ఒక సినిమాకు ఇంటర్వెల్ ముందుకు ఒక స్టోరీ.అదేవిదంగా రాజకీయంగా కూడా సమయానికి అనుకూలంగా సినిమా వేశాల్లాగానే ప్రవర్తిస్తుంటాడు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రుల నుంచి మొదలుకొని తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన ముఖ్య మంత్రుల వరకు అందరితోనూ సక్యతగానే ఉంటారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డ్ తోను కలిసిమెలిసి ఉంటారు అనే పేరు ఉంది.మాజీ సీఎం కేసీఆర్ ఆసుపత్రిలో ఉంటె ఆయనను పరామర్శించి రాజకీయాలు వేరు,మానవసంబంధాలు వేరంటూ సందర్భం ప్రకారం సర్దుకుపోతుంటారు.

కాంగ్రెస్ నాయకులు మాత్రం చిరంజీవి మా నాయకుడే అని నేటికీ ఆంధ్ర ప్రదేశ్ లో అంటారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న చిరంజీవి బీజేపీ వాల్లతోని కూడా సక్యతగానే ఉంటారు.చంద్రబాబుతో మంచి సంబందాలనే కోరుకుంటున్నారు. తమ్మడు జనసేన పార్టీ వ్యవస్థాపకుడు. మరి రాబోయే ఎన్నికల్లో తమ్ముడి విజయం కోసం ప్రచారం చేస్తారా, లేక కాంగ్రెస్ నాయకుడిగా మూడు రంగుల జెండా పట్టి కాంగ్రెస్ నాయకుల విజయం కోసం పాటుపడుతాడా అనేది చిరంజీవినే స్పష్టం చేయాలంటున్నారు కాంగ్రెస్ పెద్దలు. ఇదిఇలా ఉండగాతమ్మడు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో పట్టుదలతో ఉన్నారు.తెలుగుదేశం తో పొత్తు పెట్టుకొని జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే లక్ష్యంతో ప్రచారాన్ని ముమ్మరం చేసారు. సినిమా షూటింగ్ లో ఉన్న అన్నయ్య చిరంజీవి వద్దకు పవన్ కళ్యాణ్ అకస్మాత్తుగా వెళ్లడంతో రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారం లేచింది.కొద్దీ సేపు అన్నదమ్ములు మాట్లాడుకున్నారు సరదాగా. వీరిద్దరితోపాటు నాగేంద్రబాబు కూడా అన్న, తమ్ముడితో గడిపాడు.ముచ్చట ముగిసిన తరువాత చిరంజీవి తమ్ముడు పవన్ చేతిలో ఐదు కోట్ల విరాళం ఇస్తున్న చెక్కును ఇవ్వడంతో షూటింగ్ లో ఉన్న వారంతా ఆశ్చర్యానికి లోనయ్యారు. నాగేంద్ర బాబు సంతోషం అంత ఇంత కాదు. ఇలా విరాళంగా తమ్ముడి రాజకీయ ఖర్చుల కోసం ఐదు కోట్లు ఇస్తాడని నాగబాబు కూడా ఊహించలేదని పలువురు సినీ ప్రముఖులు అంటున్నారు. అన్నయ్య ఇచ్చిన విరాళానికి ఎలా కృతజ్ఞత చెప్పాలో తెలియక తండ్రి,తరువాత తండ్రి ఎంతయినా ఇంకేముంది సంతోషం పట్టలేక పవన్ కళ్యాణ్ కూడా చిరంజీవికి పాదాభి వందనం చేసి భక్తిని చాటుకున్నాడు.

 

 

 

 

 

 

 

 

 

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.