34.5 C
Munich
Wednesday, July 29, 2026

అసలే అమావాస్య… ఆరోజే పవన్ కు చిరంజీవి విరాళం

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

తమ్ముడి ప్రచారం కోసం చిరంజీవి ఐదు కోట్ల విరాళం
అమావాస్య రోజే ఎందుకు ఇచ్చాడు ???
కోల్ బెల్ట్ ప్రతినిధి:హైదరాబాద్
జనసేన పార్టీ వ్యవస్థాపకుడు,ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్నారు.మరోవైపు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్నాయి.ఒకవైపు ప్రచారం,మరోవైపు షూటింగ్ లతో తీరికలేకుండా గడపడంతో పవర్ స్టార్ అనారోగ్యానికి గురయ్యారు.హైదరాబాద్ లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు.అప్పుడప్పుడు చిరంజీవి తన ఇద్దరు తమ్ముళ్లకు ఎక్కడ ఉన్న ఫోన్ చేసి మాట్లాడుతుంటారు.చిరంజీవి హైదరాబాద్ దగ్గర్లో ముచ్చింతల్ లో విశ్వంభర చిత్రంలో తీరికలేకుండా ఉన్నప్పటికినీ నాగబాబుకు,పవన్ కళ్యాణ్ కి ఫోన్ చేసి పిలిపించుకున్నాడు.ఎంతయినా అన్నయ్య అంటే వెలకట్టలేని ప్రేమ,గౌరవం ఆ ఇద్దఋ తమ్ముళ్లకు. ఇంకేముంది అన్నయ్య పిలుపుతో జ్వరంతో ఉన్న పవన్ కళ్యాణ్, నాగబాబును వెంటతీసుకొని వెళ్ళాడు. కొద్దిసేపు కుటుంబ విషయాలు,విశ్వంభర షూటింగ్ వివరాలు,పార్టీ ప్రచారం,విజయావకాశాల గురించి మాట్లాడుకున్నారు.

 

ఐదు కోట్ల విరాళం ….
పవన్ కళ్యాణ్ ఎన్నికల ఖర్చుకోసం చిరంజీవి ఐదు కోట్ల రూపాయల విరాళం చెక్కు రూపంలో అందజేశాడు.ఆ సమయంలో నటుడు నాగబాబు కూడా ఉన్నాడు.అన్నయ్య రమ్మంటే వచ్చాను. ఎందుకు పిలిచాడో కూడా తెలియదు. అన్నయ్య మీద గౌరవంతో జ్వరంతో ఉన్నప్పటికినీ పవన్ కళ్యాణ్ షూటింగ్ జరుగుతున్న ప్రదేశానికి రావడం జరిగింది. అకస్మాత్తుగా ఐదు కోట్ల చెక్కును చేతిలో పెట్టేసరికి ఇద్దరు తమ్ముళ్లు ఒకేసారి ఆశ్చర్యానికి గురయ్యారు.అన్నయ్య చెక్కు ఇవ్వగానే ఎలా కృతజ్ఞత చెప్పాలో పవన్కు అంతుపట్టలేదు.ఇక చేసేది ఏమిలేక అన్నయ్యకు పాదాభివందనం చేసి కృతజ్ఞత చాటుకున్నాడు పవన్ కళ్యాణ్. అయినా తమ్ముడి పాదాభివందనాన్ని అడ్డుకొని ప్రేమతో ఆలింగనం చేసుకున్నాడు.

 

అమావాస్య రోజే అన్నయ్య విరాళం….
చిరంజీవి తన తమ్ముడు పవన్ కు ఐదు కోట్ల విరాళం ఇచ్చింది సోమవారం. అదే రోజు నిండు అమావాస్య.అంతేకాదు సూర్యగ్రహణం కూడా. శాస్త్రం ప్రకారం అమావాస్య,సూర్య గ్రహణం రోజు సాధ్యమైనంత మేరకు చాలామంది కొత్త పని చేయడానికి ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు.మనదేశంలో సూర్య గ్రహణం కనిపించలేదు కాబట్టి ఆ విషయాన్నీ అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు.అమావాస్య రోజుననే ఎందుకు విరాళం ఇచ్చాడనేది చిరంజీవి,పవన్ కళ్యాణ్ అభిమానులతోపాటు చిత్రపరిశ్రమలో పెద్ద ఫజిల్ అయ్యింది.ఇదిఇలా ఉండగా అదేరోజు పవన్ కళ్యాణ్,రేణుదేశాయ్ ల కుమారుడు అఖీరా నందన్ పుట్టిన రోజు కావడం విశేషం.సాక్షాత్తు చిరంజీవికి ఇష్ట డైవమైన హనుమంతుడి విగ్రహం ఎదుట విరాళం ఇచ్చి తన భక్తిని చాటుకోవడం విశేషం.

రిపోర్టింగ్ ….పరశురాం


 

 

 

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.