NIGAMA MEDIA (P) LTD
12.4 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Thursday, September 17, 2026

ఆస్మాన్’ గ్లింప్స్‌ విడుదల..

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

హీరోగా మేఘాంశ్‌కు మంచు మనోజ్‌ శుభాకాంక్షలు
శ్రీహరి కుటుంబంతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్న మనోజ్‌
మేఘాంశ్‌ విజయవంతం కావాలని ఆకాంక్ష

కోల్ బెల్ట్ న్యూస్(హైదరాబాద్):

దివంగత నటుడు శ్రీహరి కుమారుడు మేఘాంశ్ హీరోగా తెరకెక్కుతున్న నూతన చిత్రం ‘ఆస్మాన్’ నుంచి మేకర్స్‌ తాజాగా టీజర్‌ (గ్లింప్స్‌)ను విడుదల చేశారు. దర్శకుడు రామ్‌ నందన్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్‌ దశలో ఉండగా.. విడుదలైన గ్లింప్స్‌ ద్వారా చిత్ర కథాంశం, కాన్సెప్ట్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచే ప్రయత్నం చేశారు.

బుధవారం హైదరాబాద్‌లో చిత్ర బృందం టీజర్‌ విడుదల కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు మంచు మనోజ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన శ్రీహరి కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. మేఘాంశ్‌ తనకు తమ్ముడిలాంటి వాడని పేర్కొన్న మనోజ్‌.. ‘ఆస్మాన్‌’ సినిమాతో అతడు మంచి విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షించారు.

శ్రీ క్లీంకారా సెల్యూలాయిడ్స్‌ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రశాంత్‌ విహారి సంగీతాన్ని అందిస్తున్నారు. తెలుగు ప్రేక్షకులతో పాటు ఇతర భాషల ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్నారు.

మేఘాంశ్‌ కథానాయకుడిగా పరిచయం కానున్న ఈ చిత్రం షూటింగ్‌ పూర్తిచేసుకుని త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా విడుదలైన గ్లింప్స్‌ సినిమాపై అంచనాలను పెంచడంతో పాటు.. దర్శకుడు రామ్‌ నందన్‌ ఎలాంటి కథ, కాన్సెప్ట్‌తో చిత్రాన్ని రూపొందిస్తున్నారనే విషయంపై ఆసక్తిని రేకెత్తిస్తోంది.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.