NIGAMA MEDIA (P) LTD
22.4 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Wednesday, September 16, 2026

రష్మిక మందన్న ప్రధాన పాత్రలో ‘ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మి అమ్మ’ బయోపిక్‌

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:

ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసురాలు, గానకోకిల ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా రూపొందనున్న బయోపిక్‌పై అధికారిక ప్రకటన వెలువడింది. ఈ చిత్రంలో సుబ్బులక్ష్మి పాత్రను ప్రముఖ కథానాయిక రష్మిక మందన్న పోషించనున్నారు. ‘ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మి అమ్మ’ అనే పేరుతో ఈ చిత్రం తెరకెక్కనుంది.

సెప్టెంబర్‌ 16న ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మి 116వ జయంతిని పురస్కరించుకుని చెన్నైలో ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రారంభించనున్నట్లు నిర్మాతలు వెల్లడించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

ఈ ప్రతిష్ఠాత్మక చిత్రానికి గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహించనుండగా, అనిరుధ్‌ సంగీతం అందించనున్నారు. గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై అల్లు అరవింద్‌, రాక్‌లైన్‌ వెంకటేశ్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. సుబ్బులక్ష్మి సంగీత ప్రస్థానం, వ్యక్తిగత జీవితం, ఆమె అందించిన విశిష్ట సేవలను ఈ బయోపిక్‌లో ఆవిష్కరించనున్నట్లు చిత్రబృందం పేర్కొంది.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.