NIGAMA MEDIA (P) LTD
21.4 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Sunday, September 13, 2026

Mavoist : గరియాబాద్ ఎన్కౌంటర్ మృతుల్లో మంచిర్యాల జిల్లా వాసి

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

మృతుడు జాడి వెంకటి రాష్ట్ర కమిటీ సభ్యుడు
టెక్నీకల్ టీం సభ్యుడిగా అదనపు భాద్యతలు
వెంకటి భార్య పుష్ప కూడా పార్టీలోనే
ఇద్దరు ఒకేసారి పార్టీలో చేరిక

Mavoist : ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్ జిల్లా మెయిన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బలుదిహి అడవుల్లో సెర్చ్ ఆపరేషన్ సందర్భంగా గురువారం భద్రతా సిబ్బందికి, మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో పదిమంది మావోయిస్టులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఎదురు కాల్పుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు మోడెం బాలకృష్ణ చనిపోయాడు. ఇది ఇలా ఉండగా ఇదే ఎన్కౌంటర్ లో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం సండ్రవెల్లి గ్రామానికి చెందిన జాడి వెంకట్ అలియాస్ విమల్, మంగన్న,సురేష్ మృతి చెందాడు.

మృతుడు జాడి వెంకటి మొదట పార్టీ అనుబంద సంఘమైన సి.కా.స. లో చేరాడు. 1995 లో సికాస నుంచి సింగపూర్ దళం కు పార్టీ బదిలీ చేసింది. 1999 లో సింగపూర్ లో జరిగిన ఎదురు కాల్పుల్లో వెంకటి తప్పించుకున్నాడు. అదే ఏడాది పార్టీ మహారాష్ట్రకు బదిలీ చేసింది. 2001 లో వెంకటి దండకారణ్యం భాద్యతలు చేపట్టాడు. 2011 లో జంషెడ్ పూర్ లో పోలీసులు అరెస్ట్ చేయగా బెయిల్ పై బయటకు వచ్చి దళంలోకి వెళ్ళాడు. అప్పటి నుంచి చనిపోయే వరకు వెంకటి ఇంటి మొహం చూడలేదు. పోలీసులకు కూడా చిక్కలేదు.

అతనితోపాటు అదే గ్రామానికి చెందిన జాడి పుష్ప అలియాస్ ఉమక్కసైతం అడవిబాట పట్టింది. దళంలోనే ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం పుష్ప కూడా పార్టీలో దండకారణ్యం కమిటీలో భాద్యతలు నిర్వహిస్తోంది. మృతుడు జాడి వెంకటి తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడి హోదాలో ఉన్నారు. దండకారణ్యం కమిటీలో కూడా వెంకటి అదనపు బాధ్యతల్లో ఉన్నారు. వెంకటి మృతదేహాన్ని తీసుకురావడానికి కుటుంబ సభ్యులు ప్రయత్నం చేస్తున్నట్టుగా సమాచారం.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.