23.9 C
Munich
Monday, July 27, 2026

Chanakyudu : ఈ ఐదుగురిని నమ్మితే నష్టాలను కొనుక్కున్నట్టే

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

Chanakyudu : నిత్యజీవితంలో ప్రతి ఒక్కరికి స్నేహితులు, సన్నిహితులు, బంధువులు, ఆప్త మిత్రులు ఉంటారు. వీరిలో కొందరు సోమరితనంతో గడుపుతారు. మరికొందరు చురుకుగా ఉంటారు. కొందరు కష్టాన్ని నమ్ముకుంటారు. కానీ ఈ ఐదుగురిని నమ్ముకుంటే మాత్రం నష్టాలను కొనితెచ్చుకున్నట్టేనని ప్రముఖ ఆర్థిక వేత్త చాణక్యుడు తన గ్రంథాల్లో పేర్కొన్నాడు. ఆ ఐదుగురు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం….

స్వార్థపరులు…… స్వార్థపరులకు ఎంత దూరంగా ఉంటె అంత మంచిదని చాణక్యుడు చెబుతున్నాడు. అటువంటివారు మీ భావాలను గౌరవించరు. వాలు నిజమైన స్నేహితులుగా ఉండరు.సొంత ప్రయోజనం కోసం వాడుకుంటారు. మీ నమ్మకానికి ఎప్పుడూ అర్హులు అసలే కారు. కాబట్టి సాధ్యమైనంత మేరకు స్వార్థపరులను దూరం పెడితేనే చాలా మంచిదంటున్నాడు చాణక్యుడు.

అసూయపడే వారు…… మీ అభివృద్ధిని చూసి తట్టుకోలేని వారందరు కూడా అసూయపడేవారే. అటువంటి వారందరు కూడా ఎప్పుడు మిమ్మల్ని విమర్శిస్తుంటారు. మిమ్మల్ని నష్టపరచడానికి అవకాశం కోసం ఎదురుచూస్తుంటారు. మీ నష్టాన్నే కోరుకుంటారు. అటువంటి వారితో జాగ్రత్తగా ఉండాలి. దూరం పెట్టాలి.

గౌరవం ఇవ్వని వారు….. మీ వ్యక్తిగత జీవితానికి ప్రాముఖ్యత ఇవ్వనివారు, మీ హోదాకు గుర్తింపు ఇవ్వనివారు మీకు తగిన వ్యక్తులు కాదు. అటువంటి వారు స్వార్థ కారణాలతో మిమ్మల్ని మోసం చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ వ్యక్తిత్వానికి గౌరవం ఇచ్చే వ్యక్తులనే ఆదరించండి.

అబద్దం చెప్పేవారు….. తన తప్పు, ఒప్పులను దాచుకుంటూ, తన విషయాలను నిజం చెప్పకుండా అబద్దాలతో గడిపేవారిని అసలే నమ్మరాదంటున్నాడు చాణక్యుడు. అబద్దం చెప్పేవారితో స్నేహం, సంబంధం నిలకడగా ఉండదు. తమ స్వార్థం కోసం నమ్మేవిదంగా అబద్దాలు చెబుతారు. అబద్దాలతో నమ్మిన వారిని మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అటువంటి వారిని దూరం పెట్టాల్సిందే.

మాట తప్పే వ్యక్తులు ….. స్థిరమైన మాటకు కట్టుబడి ఉండకుండా, స్థిరమైన ఆలోచన విధానంకు కట్టుబడి లేని వారితో స్నేహం చేయడం ఇబ్బంది. అటువంటి వారు నమ్మదగిన వారు కాదంటున్నారు చాణక్యుడు. తమ అవసరాలకు తగినట్టుగా మాట్లాడుతూ ఎదుటివారిని వాడుకుంటారు.

Author

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.