NIGAMA MEDIA (P) LTD
-1.2 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Saturday, November 28, 2026

పూలే విగ్రహ ఏర్పాటులో పదేళ్లుగా నిర్లక్ష్యమెందుకు?

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

2027 ఏప్రిల్ 11లోగా మంచిర్యాల నడిబొడ్డున విగ్రహం ఏర్పాటు చేయాలి
బీసీ ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధితో స్పందించాలి
బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి నరెడ్ల శ్రీనివాస్ డిమాండ్
కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల):

మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహ ఏర్పాటుకు గత పదేళ్లుగా బీసీ సమాజం చేస్తున్న డిమాండ్‌ను అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం విచారకరమని బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి నరెడ్ల శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. 2027 ఏప్రిల్ 11న నిర్వహించనున్న మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతి నాటికి మంచిర్యాల పట్టణ నడిబొడ్డున ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

 

శనివారం మంచిర్యాల పట్టణంలో బీసీ సమాజ్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో నరెడ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. మహాత్మా జ్యోతిరావు పూలే గొప్ప సంఘసంస్కర్త అని, మహిళా విద్యాభివృద్ధికి విశేష కృషి చేయడంతోపాటు కులవివక్ష, సామాజిక అసమానతలు, దురాచారాలకు వ్యతిరేకంగా జీవితాంతం పోరాడిన మహనీయుడని కొనియాడారు. ఆయన చరిత్ర, ఆశయాలు, సామాజిక ఉద్యమ స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పూలే బడుగు, బలహీన వర్గాల బహుజన ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు.

మంచిర్యాల మున్సిపాలిటీగా ఉన్నప్పటి నుంచి నేటి మున్సిపల్ కార్పొరేషన్ వరకు పూలే విగ్రహ ఏర్పాటుకు స్థలం కేటాయించి, కౌన్సిల్‌లో తీర్మానం చేసి అనుమతులు మంజూరు చేయాలని గత పదేళ్లుగా బీసీ సమాజం కోరుతున్నప్పటికీ ఫలితం లేకుండా పోయిందని విమర్శించారు. అనేకసార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు అందజేసినా స్పందన లేకపోవడం బాధాకరమన్నారు.

పదేళ్లుగా ఎదురుచూస్తున్న బీసీ సమాజం సహనాన్ని పరీక్షించవద్దని, విగ్రహ ఏర్పాటుకు అనుమతులు ఇవ్వకపోతే భవిష్యత్తులో చేపట్టే ఉద్యమ కార్యాచరణకు ప్రభుత్వమే, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. పూలే విగ్రహ ఏర్పాటు కేవలం ఒక విగ్రహానికి సంబంధించిన అంశం కాదని, అది బహుజన సమాజ ఆత్మగౌరవం, సామాజిక న్యాయానికి సంబంధించిన విషయమని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కర్రె లచ్చన్న, బెర ప్రభాకర్, తుల మధు, కోట సుధాకర్, బీసీ సమాజ్ జిల్లా నాయకులు కర్ణకంటి రవీందర్, జక్కం రవీందర్, ఎండీ లతీఫ్, పెద్దపల్లి సూరయ్య, సంద ప్రభాకర్, గుండ్ల లక్ష్మణ్, తోటకూర శ్రీనివాస్, ముదెపల్లి రమేష్, వేముల నాగరాజు, తాటిపాముల సమ్మయ్య, గుమ్ముల శ్రీనివాస్, కొండు రాజు, శ్రీధర్ రాజ్, గుమ్మల సుదర్శన్, ఎండీ అజీమ్, మర్యాద సురేష్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.