NIGAMA MEDIA (P) LTD
-1.2 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Saturday, November 28, 2026

పెద్దపల్లిలో ఘనంగా మహాత్మా జ్యోతిబా ఫూలే 136వ వర్ధంతి

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

మహిళా విద్యకు మహోన్నత మార్గదర్శి ఫూలే
పెద్దపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జ్ సలేంద్ర కొమురయ్య యాదవ్
కోల్ బెల్ట్ న్యూస్(పెద్దపల్లి):

మహిళా విద్యాభివృద్ధి, సామాజిక సమానత్వం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం మహాత్మా జ్యోతిబా ఫూలే చేసిన సేవలు చిరస్మరణీయమని తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జ్ సలేంద్ర కొమురయ్య యాదవ్ అన్నారు.పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన మహాత్మా జ్యోతిబా ఫూలే 136వ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని ఫూలే విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా సలేంద్ర కొమురయ్య యాదవ్ మాట్లాడుతూ.. మహిళలకు విద్య అందించేందుకు మహాత్మా జ్యోతిబా ఫూలే చేసిన పోరాటం, కృషి సమాజానికి ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మి, మహిళలు మరియు అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఫూలే చేసిన కృషి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు.

సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఫూలే చూపిన బాటలో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. ఫూలే ఆశయాలను ఆచరణలో పెట్టడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి జిల్లా అధ్యక్షురాలు సిరవేన స్వప్న, పెద్దపల్లి జిల్లా ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు బొంగాని శంకర్ గౌడ్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఉస్థెం శ్రీనివాస్ ముదిరాజ్, సుల్తానాబాద్ మండల అధ్యక్షుడు కర్ణాకర్, కారుపాకల రమేష్, బీసీ సంఘం మండల అధ్యక్షుడు రవి, అంజలి, సాగర్ల వాసవి, రవళి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.