279 మంది విద్యార్థులకు కేటాయింపు
211 మంది హాజరు, 68 మంది గైర్హాజరు
కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల):
మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని పీఎం శ్రీ టీజీ మోడల్ స్కూల్ పరీక్షా కేంద్రంలో జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష (JNVST–2026) శనివారం ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పరీక్ష నిర్వహించారు.ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు పరీక్ష కొనసాగింది. ఈ కేంద్రానికి మొత్తం 279 మంది విద్యార్థులను కేటాయించగా, 211 మంది పరీక్షకు హాజరయ్యారు. మరో 68 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు.
పరీక్ష నిర్వహణకు చీఫ్ సూపరింటెండెంట్‌గా పీఎం శ్రీ టీజీ మోడల్ స్కూల్ మందమర్రి ప్రిన్సిపాల్ శ్రీమతి సారా తస్నీమ్ వ్యవహరించారు. సెంటర్ లెవల్ అబ్జర్వర్‌గా జవహర్ నవోదయ విద్యాలయ, సిర్పూర్ కాగజ్‌నగర్‌కు చెందిన శ్రీమతి కె. మంజుల విధులు నిర్వహించారు. మందమర్రి మండల తహసీల్దార్, మండల విద్యాశాఖాధికారి పరీక్షా కేంద్రాన్ని సందర్శించి ఏర్పాట్లను, పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించారు.విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించి, నిబంధనల ప్రకారం పారదర్శకంగా పరీక్ష నిర్వహించారు. పరీక్ష విజయవంతంగా ముగియడంతో సహకరించిన అధికారులకు, సిబ్బందికి చీఫ్ సూపరింటెండెంట్ సారా తస్నీమ్ కృతజ్ఞతలు తెలిపారు.

