NIGAMA MEDIA (P) LTD
0 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Friday, November 27, 2026

ప్రజా సమస్యలపై పోరాటమే బీజేపీ లక్ష్యం

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

బెల్లంపల్లిలో పట్టణ పదాధికారుల సమావేశం
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
మాజీ ఎమ్మెల్యే, అమురాజుల శ్రీదేవి
కోల్ బెల్ట్ న్యూస్(బెల్లంపల్లి):

బెల్లంపల్లి పట్టణంలో భారతీయ జనతా పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేస్తూ, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని బీజేపీ నాయకులు పిలుపునిచ్చారు. బెల్లంపల్లి పట్టణంలో శుక్రవారం బీజేపీ పట్టణ అధ్యక్షురాలు ధార కళ్యాణి ఆధ్వర్యంలో పట్టణ పదాధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు అమురాజుల శ్రీదేవి, పట్టణ ఇన్‌చార్జి శైలేందర్ సింగ్, జిల్లా ఉపాధ్యక్షులు కోడి రమేష్, జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు శ్రీకృష్ణదేవరాయలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నప్పటికీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. హామీల అమలుపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం బీజేపీ నిరంతరం పోరాటం సాగిస్తుందని స్పష్టం చేశారు.

పార్టీని కేవలం ఎన్నికలకే పరిమితం చేయకుండా ప్రజలకు అందుబాటులో ఉండే రాజకీయ శక్తిగా తీర్చిదిద్దాలని నాయకులు సూచించారు. ప్రతి వార్డు, ప్రతి ప్రాంతంలో పార్టీ కార్యకర్తలు చురుకుగా పనిచేస్తూ ప్రజా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా బెల్లంపల్లి పట్టణంలోని వివిధ శక్తి కేంద్రాలకు ఇన్‌చార్జిలను నియమించి పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్టం చేశారు. బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తూ రాబోయే రాజకీయ సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేలా కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు.

ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా నిర్మల్ జిల్లా ఇన్‌చార్జి నల్లుల సంగీత, పట్టణ ప్రధాన కార్యదర్శి ఎర్రోజు శ్రీనివాస్, సీనియర్ నాయకులు దూది ప్రకాష్, జిదుల రాములు, జిల్లా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు కోడి సురేష్, ఎరుకల నర్సింగ్, జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు నిట్ట అరుణాసుందరి, జిల్లా బీసీ మోర్చా ఉపాధ్యక్షులు ఆకుల శంకర్, పట్టణ ఉపాధ్యక్షులు గాండ్ల మహేష్, సల్లం సుమలత, భాగమోహన్, పుల్లూరి రాము, భాష బోయిన యుగేందర్, పట్టణ కార్యదర్శులు కనకం శ్రీనివాస్, అల్లకాటి మహేష్, పట్టణ యువ మోర్చా అధ్యక్షులు తోటపల్లి ఓం సాయి, ఎస్టీ మోర్చా అధ్యక్షులు బానోతు సుధాకర్, పట్టణ బీసీ మోర్చా అధ్యక్షులు సుక్క మల్లేష్, మహిళా మోర్చా అధ్యక్షురాలు చింతకింది లావణ్య, కళ్లపెళ్లి నవీన్, గీస రాములు

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.