CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 17 November 2026, 8:21 pm Posted By: coalbelt 24 News

దామ స్వామి కుటుంబాన్ని పరామర్శించిన తెలంగాణ రక్షణ సేన నియోజకవర్గ ఇన్‌చార్జి

కోల్ బెల్ట్ న్యూస్(పెద్దపల్లి):

కాల్వశ్రీరాంపూర్ మండలంలోని గంగారం గ్రామానికి చెందిన దామ స్వామి ఇటీవల స్వర్గస్థులైన నేపథ్యంలో తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్ మంగళవారం వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

దామ స్వామి కుమారుడు రాజేశం, ఇతర కుటుంబ సభ్యులను కలిసి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ఉండాలని, దామ స్వామి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.

ఈ పరామర్శ కార్యక్రమంలో టీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు బొంగోని శంకరయ్య గౌడ్, కారుపాకల రమేష్ తదితరులు పాల్గొన్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});