NIGAMA MEDIA (P) LTD
7.5 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Tuesday, November 17, 2026

పదో తరగతి పరీక్ష ఫీజు పేరుతో అక్రమ వసూళ్లు

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

చైతన్య హైస్కూల్‌పై చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్‌కు ఫిర్యాదు
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):

పట్టణంలోని చైతన్య హైస్కూల్ యాజమాన్యం పదో తరగతి పబ్లిక్ పరీక్ష ఫీజు పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధిక మొత్తంలో వసూళ్లకు పాల్పడుతోందని పట్టణ కార్యదర్శి దుర్గరాజ్ కామెర ఆరోపించారు. సోమవారం మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ రాములుకు వినతిపత్రం సమర్పించి, పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా దుర్గరాజ్ కామెర మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు రూ.125 ఫీజు నిర్ణయించగా, పాఠశాల యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోకుండా ఒక్కో విద్యార్థి నుంచి రూ.1,000 వసూలు చేస్తోందని ఆరోపించారు. అదనంగా వసూలు చేస్తున్న రూ.875ను ఏ ప్రాతిపదికన తీసుకుంటున్నారో యాజమాన్యం స్పష్టం చేయాలని, వసూళ్లకు సంబంధించిన రసీదులను అధికారులు పరిశీలించాలని కోరారు.

అదేవిధంగా 80 శాతం పాఠశాల ట్యూషన్ ఫీజు చెల్లిస్తేనే ఎస్‌ఎస్‌సీ పరీక్ష ఫీజు స్వీకరిస్తామని యాజమాన్యం షరతు విధించడం సరికాదన్నారు. ఈ నిబంధన కారణంగా పేద, మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ట్యూషన్ ఫీజు బకాయిలను బోర్డు పరీక్ష ఫీజుతో ముడిపెట్టే విధానాన్ని తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.ఫీజు వివాదాల కారణంగా ఏ ఒక్క విద్యార్థి కూడా పదో తరగతి పరీక్షలకు దూరం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలితే సంబంధిత పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని దుర్గరాజ్ కామెర విజ్ఞప్తి చేశారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.