NIGAMA MEDIA (P) LTD
7.5 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Tuesday, November 17, 2026

జాతీయ జూనియర్ హ్యాండ్‌బాల్‌ పోటీలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా క్రీడాకారిణులు

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

మర్సకోల కవిత, కొట్నాక్ శిరీష రాష్ట్ర జట్టుకు ఎంపిక
కోల్ బెల్ట్ న్యూస్ క్రీడాప్రతినిధి:

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన క్రీడాకారిణులు మర్సకోల కవిత, కొట్నాక్ శిరీష జాతీయస్థాయి జూనియర్ బాలికల హ్యాండ్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలకు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని ఉమ్మడి జిల్లా హ్యాండ్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గోని శ్యాంసుందర్రావు, ప్రధాన కార్యదర్శి కనపర్తి రమేష్‌, కోశాధికారి అల్గువెల్లి రమేష్‌రెడ్డి తెలిపారు. ఇటీవల ఖమ్మం జిల్లాలో నిర్వహించిన 48వ రాష్ట్రస్థాయి జూనియర్ బాలికల హ్యాండ్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్టు ప్రతిభ కనబరిచి మూడో స్థానంలో నిలిచింది. ఈ టోర్నీలో అత్యుత్తమ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించిన మర్సకోల కవిత, కొట్నాక్ శిరీషను రాష్ట్ర జట్టుకు ఎంపిక చేశారు.

రాష్ట్రస్థాయి పోటీల్లో అద్భుతమైన ఆటతీరుతో ప్రత్యర్థి జట్లపై ఆధిపత్యం ప్రదర్శించిన ఈ ఇద్దరు క్రీడాకారిణులు తమ ప్రతిభతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించారు. ముఖ్యంగా మ్యాచ్‌లలో వేగవంతమైన కదలికలు, బంతిపై నియంత్రణ, పాసింగ్‌, డిఫెన్స్‌, అటాకింగ్‌ నైపుణ్యాలను సమర్థంగా ప్రదర్శించడం ద్వారా రాష్ట్ర జట్టులో చోటు దక్కించుకున్నారు.ఎంపికైన క్రీడాకారిణులు ఈ నెల 25 నుంచి 29వ తేదీ వరకు పంజాబ్ రాష్ట్రంలోని సంగ్రూర్‌లో నిర్వహించనున్న జాతీయస్థాయి జూనియర్ బాలికల హ్యాండ్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో రాష్ట్ర జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. జాతీయస్థాయిలో కూడా అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రానికి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు పేరు తీసుకురావాలని క్రీడాభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన మర్సకోల కవిత, కొట్నాక్ శిరీషలను ఒలింపిక్‌ అసోసియేషన్‌ కార్యదర్శి రఘునాథరెడ్డి, డీవైఎస్‌ఓ హనుమంతరెడ్డి, సీనియర్‌ పీడీలు రోజా వరకుమారి, ఫ్రాన్సిస్‌, కే. రామ్మోహన్‌రావు, గాజుల శ్రీనివాస్‌, సీనియర్‌ క్రీడాకారులు, కోచ్‌లు సునర్కర్‌ అరవింద్‌, దుర్గం రాజలింగు, రాజశేఖర్‌, కళ్యాణ్‌, సాయి, విశాల, సుప్రజ తదితరులు అభినందించారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.